బాలిక మీద అత్యాచారయత్నం చేసిన బాలుడు
బెంగళూరు: బాలిక మీద అత్యాచార యత్నం చేసిన బాలుడికి దేహశుద్ది చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బాలికను వైద్య పరీక్షలకు తరలించి విచారణ చేస్తున్నామని బుధవారం పోలీసులు తెలిపారు.
గంగమ్మనగుడి ప్రాంతంలో 17 సంవత్సరాల బాలుడు నివాసం ఉంటున్నాడు. ఇతను బార్ లో పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతంలో ఐదు సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. మంగళవారం రాత్రి బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్నది.

అదే సమయంలో బార్ లో పని చేస్తున్న బాలుడు ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక దగ్గరకు వెళ్లాడు. చాక్లెట్ తీసి ఇస్తానని చెప్పి బాలికను పిలుచుకుని వెళ్లాడు. ఆ సమయంలో స్థానికులు అనుమానస్పదంగా తిరుగుతున్న అతనిని గమనించారు.
బాలికను పిలుచుకుని సమీపంలోని ఇంటి దగ్గర ఉన్న బాత్ రూంలోకి వెళ్లాడు. బాలిక దుస్తులు విప్పదీసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో స్థానికులు విషయం గుర్తించి అతనిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications