
ఈగల వల్ల అక్కడ పురుషులకు పెళ్ళిళ్ళు కావటం లేదు, పెళ్ళైన వాళ్ళు విడాకులంటున్నారు!!
ఈగ... ఈగ ఏం చేస్తుంది లే.. ఈగే కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా? ఈ స్టోరీ తెలిస్తే ఈగలు ఏం చేయగలవో మీకే అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ లోని అహిరోరి బ్లాక్ లోని గ్రామాలలో ఈగలు చేస్తున్న విధ్వంసం అక్కడ మగవాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అక్కడ గ్రామాలలో ఈగల దెబ్బకు పెళ్లి కాని పురుషులకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాకపోగా, ఇక పెళ్లయిన వారు విడాకుల దాకా వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఇంతకీ ఆ గ్రామాలలో ఏం జరుగుతుందంటే..

గణనీయంగా పెరిగిన ఈగల సంఖ్య.. యూపీలోని ఆ గ్రామాల్లో కొత్త తలనొప్పి
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ లోని అహిరోరి బ్లాక్ లోని బధైయాన్ పుర్వా, కుయాన్, పట్టి, దహీ, సేలం పూర్, ఝల్ పూర్వా, నయా గావ్, డియోరియా మరియు ఎక్ఘరా గ్రామాలలో ప్రజలకు ఈగలు అతిపెద్ద సమస్యగా మారాయి. 2014 సంవత్సరంలో ఈ ప్రాంతంలో కమర్షియల్ పౌల్ట్రీ ఫారం ప్రారంభించడంతో ఇక్కడ ఈగల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఈ గ్రామాలలో ప్రజలకు ఊహించని తలనొప్పి వచ్చి పడింది.

పురుషులకు పిల్లనివ్వటం లేదు... పెళ్ళైనా విడాకులు అడుగుతున్నారు
ఈగల దెబ్బతో గ్రామాలలో రోగాలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఈ గ్రామాలలోని పురుషులకు పిల్లనివ్వడానికి అమ్మాయిల తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. ఇక ఇప్పటికే పెళ్లయిన మహిళలు ఆ గ్రామాలలో ఉండడానికి ససేమిరా అంటున్నారు. వేరే చోటికి వెళ్లి వేరు కాపురం పెడదామని, లేదంటే విడాకులు ఇస్తామని భర్తలను బెదిరిస్తున్నారు. ఇప్పటికి ఒకే సంవత్సరంలో బధైయన్ పూర్వా గ్రామానికి చెందిన కనీసం ఆరుగురు వధువులు తన భర్తను విడిచి పెట్టి పుట్టింటికి చేరుకున్నారు.

ఆ గ్రామాలు వదిలివస్తేనే కాపురం.. లేదంటే విడాకులే అంటున్న కోడళ్ళు
వారు
తమ
భర్తలను
ఆ
గ్రామం
వదిలిపెట్టి
రావాలని,
లేదా
తమను
మర్చిపోవాలని
బెదిరిస్తున్నారు
.
ఈగల
తో
బ్రతకటం
ఇష్టంలేక
మహిళలు
భర్తతోనే
విడిపోవడానికి
నిర్ణయం
తీసుకున్నారంటే
పరిస్థితి
ఎంత
దారుణంగా
ఉందో
అర్థం
చేసుకోవచ్చు.
ఈగల
వల్ల
అక్కడ
పురుషులకు
సంబంధాలను
చూడ్డానికి
వచ్చే
వారు
సైతం
భయపడి
పారిపోతున్నారు.
ఇన్ని
ఈగలు
ఉన్న
ఈ
గ్రామాలలో
తమ
పిల్లల్ని
ఇవ్వలేమని
తేల్చి
చెబుతున్నారు.

వేలసంఖ్యలో ఈగలు..ఈగల దెబ్బకు అంతా హడలు
ప్రతి
గ్రామంలోనూ
వేలసంఖ్యలో
ఈగలు
రాత్రి,
పగలు
తేడా
లేకుండా
దాడి
చేస్తుంటే,ఆ
ఊర్లలో
ఈగల
మోత
దారుణంగా
ఉంటే
ఈ
సంవత్సరం
ఆ
గ్రామాలలో
పెళ్లి
బాజాలు
మోగకపోవడం
ప్రధానంగా
కనిపిస్తుంది.
ఈగల
నుంచి
మమ్మల్ని
కాపాడండి
మహాప్రభో
అని
అనేకమార్లు
అధికారులకు
విజ్ఞప్తి
చేసినా
ఫలితం
లేకపోయింది.
దీంతో
ఈ
గ్రామాల
ప్రజలు
ఈగల
దెబ్బకు
పెళ్లిళ్లు
కూడా
కాని
దారుణ
పరిస్థితిని
జీర్ణించుకోలేకపోతున్నారు.