ఫ్లిప్‌కార్ట్ ‘ఆపిల్ డేస్’ షురూ... ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
‘ఆపిల్ డేస్’ పేరుతో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ సేల్.. ఈనెల 24 నుంచి 26 వరకు.. అంటే మూడు రోజుల పాటు కొనసాగనుంది.
న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్.. 'ఆపిల్ డేస్' పేరుతో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ సేల్.. ఈనెల 24 నుంచి 26 వరకు.. అంటే మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఐఫోన్, మ్యాక్‌బుక్ ప్రొ, ఆపిల్ వాచ్, ఇంకా ఇతర ఆపిల్ డివైస్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో బెస్ట్ డిస్కౌంట్.. ఐఫోన్ 7 256 జీబీ వేరియంట్‌పై 20 వేల తగ్గింపు. ఈ ఫోన్ సిల్వర్, బ్లాక్, జెట్ బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ వేరియంట్స్.. రూ.59999కు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ.19 వేల వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభించనుంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్స్‌పై అదనంగా మరో 5 శాతం తగ్గింపు వర్తిస్తుంది.

మిగతా ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్స్‌పైనా డిస్కౌంట్ల, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. ఐఫోన్ 6 16 జీబీ వేరియంట్ అయితే ఏకంగా రూ.26010 డిస్కౌంట్‌పై ఇస్తున్నది ఫ్లిప్‌కార్ట్. అంటే ఇది కేవలం రూ.25990కే లభించనుంది. ఎక్స్‌చేంజ్, యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ డిస్కౌంట్లు కూడా దీనికి వర్తిస్తాయి. ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 5ఎస్‌లపైనా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ మూడు రోజులు ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రొ రూ.54990కే ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. ఇక వివిధ డెబిట్, క్రెడిట్ కార్డ్స్‌పై కూడా రూ.1500 వరకు డిస్కౌంట్ ప్రకటించారు. ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లపై 35 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications