ఫ్లిప్ కార్ట్ సీఈవో ఛాన్స్ కొట్టేసిన లక్కీ గర్ల్!

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు ఒక్కరోజు సీఈవోగా వ్యవహరించే అవకాశాన్ని పద్మిని పగడాల దక్కించుకున్నారు. ఆ ఒక్కరోజు సీఈవో నిర్వహించబోయే అన్ని కీలక మీటింగ్ లను ఆమే నిర్వహిస్తారని ఫ్లిప్ కార్ట్

ముంబై : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవి నుంచి తప్పుకున్నారు. బిగ్ 10 సెలబ్రేషన్స్ లో భాగంగా కంపెనీ ప్రకటించిన ఒక్క రోజు సీఈవోగా పద్మిని పగడాల నియామకం కావడంతో ఆయన తన పదవి నుంచి వైదొలిగారు.

ఫ్లిప్ కార్ట్ తన ఉద్యోగుల కోసం ఈ లక్కీ ఛాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 10ఏళ్ల సెలబ్రేషన్స్ లో భాగంగా కంపెనీ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి స్థానంలో ఒక్క రోజు కోసం కొత్త సీఈవోను నియమించనున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

padmini pagadala

ఈ లక్కీ ఛాన్స్ కోసం పోటీపడాలని తన ఉద్యోగులకు పిలుపునిచ్చింది. ఒక్క రోజు సీఈవో పదవి కోసం ఉద్యోగులు దరఖాస్తులను నింపి కంపెనీ యాజమాన్యానికి పంపించాల్సి ఉంది. దీనిలో ఎందుకు వారు గుడ్ సీఈవో కావాలనుకుంటున్నారో తెలుపుతూ ఈ ఫామ్ నింపాలి.

ఒక్క రోజు సీఈవోగా పనిచేసే వారు, ప్రస్తుత సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి లాగా అన్ని మీటింగ్ హాజరుకావాలని, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపిన సంగతి తెలిసిందే.

ఫ్లిప్ కార్ట్ సూచన మేరకు ఒక్క రోజు సీఈవో కోసం దరఖాస్తు చేసుకున్న వారందరిలో పద్మిని పగడాలను ఈ ఛాన్స్ వరించింది. కల్యాణ్ స్థానంలో ఒక్క రోజు సీఈవోగా పద్మిని పగడాల అవకాశం దక్కించుకున్నారని, సీఈవో నిర్వహించబోయే అన్ని కీలక మీటింగ్ లను తానే నిర్వహిస్తారని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

మరోవైపు కల్యాణ్ కృష్ణమూర్తి కూడా దీనిపై ట్వీట్ చేశారు. ఒక్క రోజు సీఈవో కార్యక్రమంలో భాగంగా ఫ్లిప్ కార్ట్ ను పద్మిని పగడాల చేతిలో పెట్టడం చాలా ఆనందంగా ఉందని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+