Flipkart: ఫ్లిప్ కార్ట్ లో నయా ఫీచర్.. ఇక డబ్బులు పంపొచ్చట..!
ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిక్ కార్ట్ లో మరో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిక్ కార్ట్ యూపీఐ పేమెంట్ ను ప్రవేశపెట్టింది. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో ఫ్లిప్‌కార్ట్ తన స్వంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను ప్రారంభించింది. ఇ-కామర్స్ కంపెనీలు తమ కస్టమర్‌లకు మెరుగైన సేవలందించేందుకు, చెల్లింపుల కోసం థర్డ్-పార్టీ యాప్‌లకు వెళ్లకుండా ఇందులోనే పేమెంట్ చేసుకునేలా ఈ సేవలు ప్రారంభించింది.
"ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సౌలభ్యం, వ్యయ-సమర్థతను కస్టమర్‌లు మా నుండి ఆశించే విశ్వసనీయ సమర్థతతో సజావుగా విలీనం చేస్తుంది" అని ఫ్లిప్‌కార్ట్‌లోని ఫిన్‌టెక్, పేమెంట్స్ గ్రూప్ సీనియర్ వీపీ ధీరజ్ అనెజా ఒక ప్రకటనలో తెలిపారు. "మేము సురక్షితమైన, అనుకూలమైన చెల్లింపు ఎంపికలను అందించడం ద్వారా కస్టమర్‌లకు అత్యుత్తమ-వాణిజ్య అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాము. అలాగే సూపర్‌కాయిన్‌లు, బ్రాండ్ వోచర్‌లు, ఇతర అనేక రివార్డ్‌లు, ప్రయోజనాలను అందిస్తాము" అని అనీజా చెప్పారు..

ఫ్లిక్ కార్ట్ యూపీఐ సేవలు ప్రస్తుతం Android వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సేవను ఉపయోగించడానికి, ముందుగా ఫ్లిప్ కార్ట్ యాప్‌లో UPI IDని క్రియేట్ చేసుకోవాలి. ఫోన్ పే, గూగుల్ పే ఎలా చేశారో ఇందులో కూడా అలానే చేసుకోవాలి. బ్యాంక్ యాడ్ చేసుకుని పేమెంట్ చేసుకోవచ్చు. అమెజాన్ కు అమెజాన్ పే ఉండడంతో ఫ్లిప్ కార్ట్ యూపీఐ సేవలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇ-కామర్స్ దిగ్గజం ప్రకారం మార్కెట్‌ప్లేస్‌లో 50 కోట్ల కంటే ఎక్కువ నమోదిత వినియోగదారులు. 14 లక్షల మంది విక్రేతలు ఉన్నారు.ఫ్లిప్ కార్ట్ యూపీఐ ద్వారా చెల్లింపు చేస్తే సూపర్ కాయిన్స్ కూడా వస్తాయి. సో మీ ఫ్లికార్ట్ లో ఏదైనా బుక్ చేసి పేమెంట్ కు గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే కు వెళ్లకుండా డైరెక్ట్ గా ఫ్లికార్ట్ లోనే చెల్లింపు చేయవచ్చు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications