ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్: ఈ నెలాఖరువరకు హోమ్ అప్లయిన్స్, స్మార్ట్ ఫోన్లపై 80% తగ్గింపు
ఈ -కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ గత రెండు వారాల క్రితమే పదేళ్ళ సందర్భంగా నాలుగురోజుల బిగ్ 10 సేల్ నిర్వహించింది. బంపర్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ సేల్ నిర్వహించింది.
న్యూఢిల్లీ: ఈ -కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ గత రెండు వారాల క్రితమే పదేళ్ళ సందర్భంగా నాలుగురోజుల బిగ్ 10 సేల్ నిర్వహించింది. బంపర్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ సేల్ నిర్వహించింది.
ప్రస్తుతం మరో సమ్మర్ సేల్ తో మనముందుకు వచ్చేసింది. నేటి నుండి ఈ నెల చివరివరకు 80 శాతం డిస్కౌంట్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఎలాంటి ఖర్చులేని ఈఎంఐలతో సమ్మర్ సేల్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
హోమ్ అప్లయిన్స్ స్మార్ట్ ఫోన్లపై ఈ కంపెనీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.స్మార్ట్ ఫోన్ మోడల్స్ ప్లాట్ పై 10వేల రూపాయాల వరకు తగ్గింపును అందిస్తోంది.

జియోర్డోనో వాచ్ లు, మహిళల ప్రీమియం బ్యాగులపై కనీసం 75 శాతం వరకు తగ్గింపును ఈ కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఆపిల్ వాచ్ సీరీస్ 2 పై 14 శాతం తగ్గింపు, 40 అంగుళాల సోని టెలివిజన్ పై 20 శాతం తగ్గింపు, ఫిట్ నెస్ ప్రొడక్ట్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్లను ప్లిప్ కార్ట్ అందుబాటులో ఉంచింది.
అదే విధంగా ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికోసం నికోస్ డీఎస్ ఎల్ ఆర్ కెమెరాను 20 శాతం తగ్గింపుధరకు కొనుగోలు చేయవచ్చు.మహిళా వినియోగదారులను ఆకట్టుకోవడం ఫ్యాషన్ ఆపీరల్స్ పై కూడ డిస్కౌంట్లను ప్రకటించింది. వెబ్ సైట్ వివరాల ప్రకారంగా పోన్ పేతో లావాదేవీలు జరిపిన వారికి తమ ఫ్లాట్ పామ్ పై 25 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది.
ఫోన్ పే అనేది ప్లిప్ కార్ట్ కు చెందిన పేమెంట్ సిస్టమ్. ఈ నెల మొదటివారంలో నిర్వహించిన బిగ్ 10 సేల్ తో పోన్ పే లావాదేవీలు 30 శాతం పెరిగాయి.
సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు వాడిన కస్టమర్లకు అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ నెల మొదట్లోనే ప్లిప్ కార్డ్ కంటే కొంచెం ముందుగా ప్రత్యర్థి అమెజాన్ కూడ గ్రేట్ ఇండియన్ సేల్ ను నిర్వహించింది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications