అక్టోబర్ 13-17: ఫ్లిప్‌కార్ట్ మరో 'బిగ్ బిలియన్ సేల్'

ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ బిలియన్ సేల్ ప్రకటించింది. దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 'బిగ్ బిలియన్ సేల్'ను ప్రకటించింది. సుమారు 70కి పైగా ఉత్పత్తులకు సంబంధించి విభాగాలలో భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది.

దసరా, దీపావళి పండగ సీజన్ల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ ఈ బిగ్‌ బిలియన్‌ సేల్‌ను పెట్టింది. 75శాతం షాపింగ్‌ మొబైల్‌ ద్వారానే జరుగుతుందని, ఈ ఈవెంట్‌ కేవలం యాప్‌కు మాత్రమేనని, యాప్‌ ద్వారా ఆఫర్లు వినియోగించుకొని కొనుక్కోవచ్చని సూచించింది.

Flipkart's Big Billion Days sale returns on 13-17 Oct but this time it's app-only

బిగ్‌ బిలియన్‌ సేల్‌లో భాగంగా మింత్రాలో కూడా ఆఫర్లు వర్తిస్తాయంది. గత ఏడాది 'బిగ్‌ బిలియన్‌ డే' సేల్‌ సందర్భంగా జరిగిన పొరపాట్లపై ఫ్లిప్‌కార్ట్‌ క్షమాపణలు కోరింది. వినియోగదారుల అంచనాలు అందులేకపోవడంపై విచారం వ్యక్తం చేసింది.

ఈ ఏడాది అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంది. వివిధ కేటగిరీల్లో ఎన్నో ప్రాడక్టులు ఉంటాయని తెలిపారు. తమ కస్టమర్లు పరిపూర్ణంగా షాపింగ్ చేసుకునేందుకు ఐదో రోజుల కంటే తక్కువ వ్యవధి ఇవ్వడం సబబు కాదనే, అన్ని రోజులు ఇచ్చినట్లు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+