Rains In Gujarat: భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం..
భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. జునాగఢ్ జిల్లాలో భారీ వర్షాలు నదులు ఉప్పొంగుతోన్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) వివిధ గుజరాత్ జిల్లాలకు జూలై 24 వరకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. "ఈరోజు జునాగఢ్‌లో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోకి పెద్ద మొత్తంలో నీరు ప్రవేశించింది. ప్రజలు సురక్షితంగా ఉన్నారు. అయినప్పటికీ, NDRF, SDRF బృందాలు అక్కడ మోహరించాం" అని గుజరాత్ మంత్రి రాఘవ్‌జీ పటేల్ చెప్పారు.
జునాగఢ్‌లో భారీ వర్షాల కారణంగా, సిఎం భూపేంద్ర పటేల్ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసి, కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజ్‌కోట్ జిల్లా నుంచి మున్సిపల్ బృందాలు, 25,000 ఫుడ్ ప్యాకెట్లు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను కూడా సహాయ చర్యల కోసం జునాగడ్‌కు పంపుతున్నట్లు రాజ్‌కోట్ కలెక్టర్ ప్రభవ్ జోషి తెలిపారు. జునాగఢ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పశువులు, వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.

జునాగఢ్ జిల్లాలో బాధిత ప్రజలకు ఆహారం అందించడానికి వివిధ సామాజిక సంస్థల మద్దతుతో 25,000 కంటే ఎక్కువ ఆహార ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూలై 24 నాటికి వర్షపాతం తీవ్రత తగ్గుతుందని, జూలై 25న కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని IMD అహ్మదాబాద్ హెచ్చరించింది.
VIDEO | Flood-like situation in Junagadh, Gujarat after torrential downpour. pic.twitter.com/cxm5vhQjuu
— Press Trust of India (@PTI_News) July 22, 2023
జునాగఢ్, జామ్‌నగర్, దేవభూమి ద్వారక, కచ్, సూరత్, వల్సాద్, నవ్‌సారి, సూరత్ జాల్లాలకు రెడ్ అలర్ట్, అహ్మదాబాద్, ఆనంద్, బరూచ్, బనస్కాంత, సబర్‌కాంత, అమ్రేలీ, జామ్‌నగర్, గిర్ సోమనాథ్, కచ్, రాజ్‌కోడ్, సురేంద్ర నగర్, వనగఢ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. సౌరాష్ట్ర, కచ్‌లోని లోతట్టు ప్రాంతాలలో వరదలు వచ్చాయి.












Click it and Unblock the Notifications