ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 11% -‘V’ షేప్‌లో -లోక్‌సభలో ఆర్థిక సర్వే 2020-21 -ప్రవేశపెట్టిన నిర్మల
కరోనా లాక్ డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని, 'V' ఆకారంలో పైపైకి వెళతామని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆశాభావం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఆర్థిక సర్వే 2020-21ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.
బడ్జెట్ సమావేశాల మొదటిరోజైన శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రసంగం తర్వాత లోక్‌సభ సమావేశమైంది. ఇటీవల మరణించిన ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. అనంతరం సభ జరుగుతోన్న సమయంలో విపక్ష ఎంపీలు.. వ్యవసాయ చట్టాలపై చర్చను కోరుతూ ఆందోళనకు దిగాయి. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ .. ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు.

మొత్తం రెండు భాగాల్లో ఆర్థిక సర్వే కాపీలను ప్రచురించారు. 2021-22లో జీడీపీ వృద్ధి 11 శాతంగా ఉంటుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది. అయితే, జీడీపీ మాత్రం ఓ మోస్తరుగా ఉంటుందని సర్వేలో పేర్కొన్నారు. అదే సమయంలో సమయంలో ద్రవ్యోల్బణం 15.4 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. స్వాతంత్ర్యం తర్వాత ఇదే అత్యధిక ద్రవ్యోల్బణమని పేర్కొన్నారు. కాగా, 'V ఆకార (వేగంగా పడి, వేగంగా లేచిన)' అభివృద్ధిని చోటుచేసుకుంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్ ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ అని తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మల ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తుండగా, స్పీకర్ ఓం బిర్లా సభను సోమవారానికి వాయిదా వేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం 11 గంటలకు మళ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అదే రోజు నిర్మల కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications