Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ecomomic Survey: నిర్మలమ్మ ఆర్ధిక సర్వే-వృద్ధి రేటు అంచనా 6.3-6.8 శాతమే ..!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అంటే 2024-25కు సంబంధించి ఆర్ధిక సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. తొలుత లోక్ సభలో అనంతరం రాజ్యసభలో ఆమె ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. అయితే ఆర్ధిక వ్యవస్థ మందగమన పరిస్ధితుల్లో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.3 శాతం నుంచి 6.8 శాతం మధ్యన ఉండొచ్చని అంచనా వేశారు.

రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని ఆర్ధిక సర్వే తెలిపింది. సమీప-కాల అంతర్జాతీయ వృద్ధి ట్రెండ్ స్థాయి కంటే కొంచెం తక్కువగనే మన ఆర్ధిక వృద్ధి ఉంటుందని ఈ సర్వే అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో వాణిజ్య దృక్పథం స్తబ్దుగానే ఉంటుందని ఇందులో అంచనా వేశారు. అలాగే దేశీయంగా, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం వినియోగానికి మంచి సూచనగా చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరి 6.4 శాతంగా అంచనా వేశారు. ఇది బలహీనమైన తయారీ, పెట్టుబడి పనితీరుకు సంకేతంగా భావిస్తున్నారు. ఇది గత ఏడాది వృద్ధి అంచనా 6.5-7 శాతం ఆర్బీఐ అంచనా అయిన 6.6 శాతం కంటే తక్కువే.

FM Sitharaman tables Economic Survey 2024-25 in Parliament- here are details

మరోవైపు వ్యవసాయం, అనుబంధ రంగాలు ఈ ఆర్ధిక సంవత్సరంలో దేశ జీడీపీలో 16 శాతం వాటాకు చేరుకున్నట్లు ఆర్ధిక సర్వే తెలిపింది. రుణ సదుపాయాన్ని మెరుగుపరచడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, సాంకేతికతను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించి, రైతు ఆదాయాలను పెంచడానికి, వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్రం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని సర్వే వెల్లడించింది. చిన్న, సన్నకారు రైతులకు సులభంగా క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేస్తూ, కొలేటరల్-ఫ్రీ వ్యవసాయ రుణాల పరిమితిని లక్షా 60 వేల నుండి రూ.2 లక్షలకు పెంచడం ఓ కీలక నిర్ణయమని పేర్కొంది.

కంప్యూటర్, సమాచార సేవలు, వృత్తిపరమైన శాస్త్రీయ సేవలు, ఇతర వ్యాపార సేవలు ఆర్ధిక వృద్ధిని రక్షించే రంగాలలో ఉన్నాయి. అలాగే వేగవంతం చేయాల్సిన రంగాలలో వాణిజ్యం, రవాణా, ఆర్థిక సేవలు, విద్య ఉన్నాయి. పరివర్తన చెందాల్సిన రంగాలలో ప్రయాణం, ఆరోగ్యం, వ్యక్తిగత, సాంస్కృతిక, వినోద సేవలు ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్, బీమా , పెన్షన్, సేవలు, ఏవీ, సంబంధిత సేవలు, పోస్టల్, కొరియర్ రంగాల్ని వాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. మరోవైపు ఇన్సూరెన్స్ రంగం కూడా 7.7 శాతం వృద్ధితో 11.2 లక్షల కోట్లకు చేరుకుందని సర్వే తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లో భారత్ కీలక స్ధానంలో ఉందని ఆర్దిక సర్వే తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్‌లో గణనీయమైన వృద్ధికి అనుగుణంగా భారతీయ విమానయాన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విమానాల కోసం అతిపెద్ద ఆర్డర్‌లలో ఒకటిగా ఉన్నాయని పేర్కొంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో సహా ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు , డెవలపర్‌లు గత ఐదేళ్లలో రూ.91,000 కోట్ల కంటే ఎక్కువ కాపెక్స్ ప్లాన్‌ను అనుసరిస్తున్నట్లు తెలిపింది. ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ కింద 88 విమానాశ్రయాలను కలుపుతూ 619 మార్గాలు, ఇందులో రెండు వాటర్ ఏరోడ్రోమ్‌లు మరియు 13 హెలిపోర్ట్‌లు అభివృద్ధి చెసినట్లు తెలిపింది. కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం కూడా 8 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+