దాణా స్కాం: లాలూను దోషిగా తేల్చిన కోర్టు, జైలుకు

లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువుల దాణాకు సంబంధించి రూ.35 కోట్ల రూపాయలు కాజేశారనే అభియోగంపై సిబిఐ విచారణ చేపట్టింది. పదహారేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతోంది. ఇప్పుడు న్యాయస్థానం లాలూతో పాటు నలభై ఐదు మందిని దోషులుగా నిర్ధారించింది. కోర్టు దోషిగా తేల్చినందున లాలూకు మూడు నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.
ఈ కుంభకోణం బయటకు రావడంతో లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఇప్పుడు దోషిగా నిర్ధారణ కావడంతో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. ఈ కేసులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఒకరు కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా. రెండో వారు లాలూ ప్రసాద్ యాదవ్. అయితే, ఇది ప్రత్యర్థి పార్టీల కుట్రగా ఆర్జేడి ఆరోపిస్తోంది.
కాగా లాలూను, జగన్నాథ మిశ్రాను కస్టడీలోకి తీసుకొని వారిని రాంచీ జైలుకు తరలించారు. మొత్తం రూ.950 కోట్ల కుంభకోణంలో లాలూ సిఎంగా ఉన్న సమయంలో రూ.35 కోట్లకు పైగా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications