దుర్మార్గుడు: మిత్రులతో భార్యను రేప్ చేయించిన భర్త

లుథియానా: భార్య పట్ల ఓ వ్యక్తి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. భార్య నుంచి బలవంతంగా విడాకులు తీసుకునేందుకు అతను దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఆమెపై తన ముగ్గురు మిత్రులతో దగ్గరుండి సామూహిక అత్యాచారం చేయించాడు.

పంజాబ్‌లో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి మొరను పోలీసులు కూడా ఆలకించలేదు. సామూహిక అత్యాచారం సెక్షన్‌ కింద మాత్రమే కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. మూడేళ్లక్రితం కూలీ పనులు చేసే ఓ వ్యక్తిని ఆమె పెళ్లాడింది. ఇద్దరికి కూడా అది రెండో పెళ్లి.

For divorce, man lets 3 friends rape wife

పిల్లలు కనడం ఇష్టంలేని భర్త ఆమెకు 8 సార్లు అబార్షన్‌ చేయించాడు. ఆపై ఆమెకు పిల్లలు కలగకుండా సర్జరీ చేయించాడు. తనకు విడాకులివ్వాలని, లేదంటే అత్యాచారం చేయిస్తానని బెదిరిస్తూ వచ్చాడు. చివరకు అన్నంత పనీ చేశాడు.

గత జూన్‌ 6న ముగ్గురు స్నేహితులను భార్య ఉన్న గదిలోకి పంపి తాళం వేసి బయట కూర్చున్నాడు. ఎట్టకేలకు స్పందించిన పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కోసం తాము గాలిస్తున్నామని, ఆమె కనిపించకపోవడంతో కేసు దర్యాప్తులో ఆలస్యం జరిగిందని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+