చిరుతకు సినిమా చూపించిన వీది కుక్కలు, చెట్టు ఎక్కికుర్చుంది, మాతోపెట్టుకోకు, చివరికి!

బెంగళూరు: ఊరిలో చొరబడటానికి ప్రయత్నించిన చిరుతకు వీది కుక్కలు సినిమా చూపించాయి. వీది కుక్కల దెబ్బకు ప్రాణాలు రక్షించుకోవడానికి చిరుత చెట్టు ఎక్కింది. అయితే వీది కుక్కలు మాతోపెట్టుకోకు అంటూ చెట్టుకింద నుంచి ఎంత సేపటికి కదలకపోవడంతో చిరుత చెట్టుమీదనే ఉండిపోయింది.

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత కళ్లికోప్పలు గ్రామంలోకి శనివారం చొరబడటానికి ప్రయత్నించింది. గ్రామం సరిహద్దులో ఉన్న వీది కుక్కలు విషయం గమనించి చిరుత గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నాయి.

Forest team rescued leopard which was stranded in tree in Mysuru

చిరుత ఎంత సేపటికి అక్కడి నుంచి కదలకపోవడంతో వీది కుక్కలు చిరుతను వెంటాడాయి. వీది కుక్కల దెబ్బకు భయపడిన చిరుత పరుగు తీసి గ్రామం సమీపంలోని నాగేగౌడ అనే వ్యక్తి పోలంలో చెట్టు ఎక్కి కుర్చుంది. వీది కుక్కలు మాత్రం చెట్టు కింద నుంచి కదల్లేదు.

విషయం గుర్తించిన గ్రామస్తులు అటవి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవి శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కింద వల పట్టుకుని చిరుతకు మత్తు మందు ఉన్న ఇంజక్షన్ వేశారు. మత్తులోకి వెళ్లిన చిరుత వలలో పడింది. చిరుతను ప్రాణాలతో రక్షించిన అటవి శాఖ అధికారులు తరువాత సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+