లాలూజీ! నన్ను క్షమించండి: 10 ని.ల ముందు నితీష్

తన రాజీనామాకు దాదాపు పది నిమిషాల ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఫోన్ చేశారు. తనను క్షమించాలని కోరారు.

పాట్నా: తన రాజీనామాకు దాదాపు పది నిమిషాల ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఫోన్ చేశారు. తనను క్షమించాలని కోరారు.

ఇటీవల నితీష్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, గ్రాండ్ అలయెన్స్‌కు దూరమయ్యారు. అనంతరం బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెల్లారే సీఎంగా ప్రమాణం చేశారు.

'Forgive Me': Minutes Before He Quit, Nitish Kumar Phoned Lalu Yadav

ఈ నేపథ్యంలో రాజీనామాకు ముందు లాలుకు ఫోన్ చేశారు. 'లాలూ జీ.. నన్ను క్షమించండి. 20 నెలల నుంచి కూటమి నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగింది. ఇంక ఎంత మాత్రం నేను కొనసాగించలేను. నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా' అని నితీశ్‌ ఫోన్‌లో లాలూకి చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే నితీశ్‌ తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని లాలూ ఫోన్‌లో కోరారని సమాచారం. ఈ ఫోన్‌ సంభాషణ అనంతరం అరగంటలోనే నితీశ్‌ రాజీనామా వార్తలు వచ్చాయి. శనివారం జేడీయూ, బిజెపికి చెందిన 27 మందితో తన మంత్రివర్గాన్ని నితీశ్‌ విస్తరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+