కర్ణాటకకు కాబోయే సీఎం ఈయనే అంటూ బాబు పేల్చిన బీజేపీ మాజీ మంత్రి, చాన్స్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పింపించి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు ?, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎవరికి సీఎం సీటు ఇస్తుంది ?, సిద్దరామయ్యకు మరోసారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అవకాశం ఇస్తుందా ? అని టెన్షన్ మొదలైయ్యింది.

అయితే ఓ సామాన్య కార్యకర్త చేతిలో ఓడిపోయిన బీజేపీ మంత్రి డాక్టర్ సుధాకర్ కర్ణాటకకు కాబోయే సీఎం విషయంలో చేసిన ట్వీట్ భారీ వైరల్ అయ్యింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 66 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ, జేడీఎస్ పార్టీలు కలిసినా కాంగ్రెస్ పార్టీని ఏమీ చెయ్యలేవు.

r Dr. Sudhakar has tweeted that the future Chief Minister of Karnataka

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డీకే. శివకుమార్ ను సీఎం చెయ్యాలా? సిద్దరామయ్యకు మరో అవకాశం ఇవ్వాలా ?, మరో నాయకుడిని తెర మీదకు తీసుకురావాలని అంటూ ఆ పార్టీలోని సీనియర్ నాయకులతో ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిపింది. బెంగళూరులోని షాంగ్రిలా అనే ప్రైవేట్ స్టార్ హోటల్ లో సీఎల్ పీ సమావేశం జరుగుతోంది.

ఇప్పటికే మాజీ సీఎం సిద్దరామయ్య వర్గంలోని సీనియర్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించారు. మరో వైపు ఒక్కలిగ కుల సంఘాల నాయకులు, ఒక్కలిగ మఠాల స్వామీజీలు అందరూ కలిసి డీకే శివకుమార్ ను సీఎం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు డిమాండ్ పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయంపై అందరూ టెన్షన్ పడుతున్నారు.

r Dr. Sudhakar has tweeted that the future Chief Minister of Karnataka

బీజేపీ మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సుధాకర్ కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ను సీఎం చెయ్యాలని పరోక్షంగా చెబుతూ ట్వీట్ చేశారు. కర్ణాటకలో ఒక్కలిగులు అందరికి అన్నం పెడుతున్నారు. ఒక్కలిగులు వ్యవసాయం చేస్తూ కన్నడిగులను ఆదుకుంటున్న అన్నదాతలు అని డాక్టర్ సుధాకర్ ట్వీట్ చేశారు.

r Dr. Sudhakar has tweeted that the future Chief Minister of Karnataka

చాలా ఏళ్ల తరువాత ఒక్కలిగ కులానికి చెందిన వ్యక్తి సీఎం కావడానికి అవకాశం వచ్చింది. అదే నాయకుడి కారణంగా పాతమైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి 5 శాతం ఎక్కువ ఓట్లు పడ్డాయని, అందువలనే కాంగ్రెస్ పార్టీకి ఇంత మెజారిటీ వచ్చిందని, కాబట్టి ఇప్పుడు వచ్చిన చక్కని అవకాశాన్ని ఒక్కలిగులు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకుడు డాక్టర్ సుధాకర్ ట్విట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకకు డీకే. శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని బీజేపీ నాయకుడు పరోక్షంగా కోరుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+