పోయస్ గార్డెన్ కు పక్కలో బల్లెం అయిన పన్నీర్ సెల్వం: ఇక సినిమానే !
పోయెస్ గార్డెన్ వెనుక ఉన్న వీనస్ కాలనీలోని ఇంటి నుంచే తన రాజకీయ కార్యకలాపాలు, అనుచరులతో సమావేశాలు నిర్వహించాలని తీర్మానించుకున్న పన్నీర్ సెల్వం నేడు కొత్త ఇంటిలో అడుగుపెట్టి శశికళ వర్గానికి సినిమా.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేడు పోయెస్ గార్డెన్ పక్కనే ఉన్న ఆళ్వార్ పేటలోని వీనస్ కాలనీలోని కొత్త ఇంటికి మకాం మార్చుతున్నారు. పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంటి వెనుకనే ఉన్న కొత్త ఇంటిలో పన్నీర్ సెల్వం అడుగుపెట్టనున్నారు.
పోయెస్ గార్డెన్ వెనుక ఉన్న ఇంటి నుంచే తన రాజకీయ కార్యకలాపాలు, అనుచరులతో సమావేశాలు నిర్వహించాలని పన్నీర్ సెల్వం తీర్మానించుకున్నారు. అందుకు అనుగుణంగా వీనస్ కాలనీలోని ఇంటిలో మార్చులు చేర్పులు చేసుకున్నారు.

అన్నాడీఎంకే పార్టీలోని రెండు చీలక వర్గాలు ఒకే ప్రాంతం (పోయెస్ గార్డెన్)లో కొలువు కావడంతో రాజకీయాలు మరింతరసవత్తరంగా మారనున్నాయి. జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంలో శశికళ అక్క కుమారుడు దినకరన్, వారి బంధువులు నివాసం ఉంటున్నారు.
ఇప్పుడు అదే ప్రాంతంలోకి మకాం మార్చనున్న పన్నీర్ సెల్వం శశికళ వర్గానికి సినిమా చూపించడానికి సిద్దం అయ్యారు. పన్నీర్ సెల్వంకు ఆ ప్రాంతంలో ఇల్లు చిక్కకుండా చూడాలని అన్నిరకాలుగా ప్రయత్నించిన శశికళ వర్గం చివరికి విఫలం అయ్యింది.












Click it and Unblock the Notifications