వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సెకెండ్ వేవ్: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ తీర్పుల వివాదాలు: ఎన్వీ రమణపై ఆశలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే వెలువడించిన కొన్ని తీర్పులు ఇప్పుడు వివాదాస్పదమౌతున్నాయి. 17 నెలల సుదీర్ఘకాలం పాటు పనిచేసిన బాబ్డే.. ఈ నెల 23వ తేదీన పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఏపీకి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా బాధ్యతలను స్వీకరించారు. దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతంగా వీస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన హయాంలో బాబ్డే ఇచ్చిన కొన్ని తీర్పులు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని, సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాలను కల్పించలేదనే వాదనలు వినిపిస్తోన్నాయి.

 జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ రాసిన లేఖలో ట్విస్ట్: సుప్రీం చీఫ్ జస్టిస్ యాక్షన్ షురూ?: సంస్కరణలు జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ రాసిన లేఖలో ట్విస్ట్: సుప్రీం చీఫ్ జస్టిస్ యాక్షన్ షురూ?: సంస్కరణలు

వలస కార్మికులపై..

వలస కార్మికులపై..

దేశ ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించేలా, పౌర హక్కులను కాపాడేలా ఎస్ఏ బాబ్డే వ్యవహరించలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. బాబ్డే తన హయాంలో పెద్దగా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనప్పటికీ.. తాను ఇచ్చిన తీర్పులతోనే వివాదాలను కొని తెచ్చుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తొలి రోజుల్లో లక్షలాది మంది వలస కార్మికులు వందల కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన అధిగమించారు. ఉత్తరం, దక్షిణ దిక్కులను ఏకం చేశారు. లాక్‌డౌన్ విధించిన సమయంలో తమ స్వగ్రామాలను చేరడానికి ఎర్రటి ఎండను సైతం లెక్కచేయలేదు.

 కేరళ జర్నలిస్ట్‌కు ఒకరకంగా.. ఆర్నబ్‌కు మరో రకంగా..

కేరళ జర్నలిస్ట్‌కు ఒకరకంగా.. ఆర్నబ్‌కు మరో రకంగా..


ఆ సమయంలో వలస కార్మికులకు కొద్దో, గొప్పో ప్రయోజనాలను కల్పించాలంటూ దాఖలైన పిటీషన్‌పై బాబ్డే సారథ్యంలోని బెంచ్.. సానుకూల నిర్ణయాన్ని తీసుకోలేకపోయిందని ఉదహరిస్తున్నారు. వలస కార్మికులకు ప్రయోజనాలను కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేయలేకపోయారని చెబుతున్నారు. వారికి భోజనం, ఇతరత్రా సౌకర్యాలను కల్పిస్తోన్న పరిస్థితుల్లో మళ్లీ ధన సహాయం చేయడం ఎందుకు? అని బాబ్డే చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ఇది రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్‌ను ఉల్లంఘినగా భావిస్తున్నారు. రాజ్యంగం కల్పించిన జీవించే హక్కును ఉల్లంఘించినట్లుగా చెబుతున్నారు.

 ఆర్టికల్ 32 కింద ఉల్లంఘనగా

ఆర్టికల్ 32 కింద ఉల్లంఘనగా


ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైన సమయంలో, ఆ సంఘటన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను కవరేజ్ చేయడానికి వెళ్లిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పాన్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దానిపై కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటీషన్‌పై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేయడం కూడా సరికాదని అంటున్నారు. ఈ పిటీషన్ ఆర్టికల్ 32ను ఉల్లంఘించేదిగా ఉందని బాబ్డే అప్పట్లో చేసిన వ్యాఖ్యానాలను గుర్తు చేస్తున్నారు.

ఎన్వీ రమణ పనితీరుపై ఆశలు..

ఎన్వీ రమణ పనితీరుపై ఆశలు..

అదే ఆర్టికల్ 32 కింద రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ ఆర్నబ్ గోస్వామి చేసిన పిటీషన్‌ను వెంటనే లిస్టింగ్ చేయడాన్ని తప్పు పడుతున్నారు. బాబ్డే పదవీ విరమణ అనంతరం ఆయన స్థానాన్ని భర్తీ చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పనితీరు ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమౌతోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్ఠను ఇనుమడింపజేసేదిగా ఎన్వీ రమణ తీర్పులు ఉంటాయని ఆశిస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం, ఆ రాజ్యంగం ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడటమే ధ్యేయంగా సుప్రీంకోర్టు తీర్పులు, ఆదేశాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. న్యాయాన్ని పరిరక్షించేలా జస్టిస్ ఎన్వీ రమణ పనితీరు ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

English summary
former Chief Justice of India SA Bobde demitted office on April 23 after completing a tenure lasting 17 months. Justice Bobde inherited a legacy which, to quote the Supreme Court, deserved to be buried fathoms deep.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X