Bengaluru: ఈ ప్రభుత్వం మీదేనా, స్టాలిన్ కు మీరు డూప్లికేట్ కదా ?, బంద్ లో !
బెంగళూరు: కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కాంగ్రెస్ నాయకులు కావేరి జలాల (cauvery water) కోసం మేకదాటు ప్రాజెక్టు కోసం పాదయాత్రలు చెయ్యడానికి అవకాశం ఉందని, అయితే అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదే కావేరి నీటి (cauvery water) కన్నడిగులు నిరసనలు చేయకూడదా?, బెంగళూరు (Bengaluru)బంద్ చేస్తున్న కన్నడిగులను అక్రమంగా అరెస్టు చేస్తాా అంటూ కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి (kumaraswamy) సిద్దరామయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు.
మంగళవారం బెంగళూరు (Bengaluru) బంద్‌పై ట్వీట్ చేసిన కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ దళపతి హెచ్‌డీ కుమారస్వామి (kumaraswamy)శాంతియుతంగా పోరాడుతున్న రైతులు, ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణంగా ఉందని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గతంలో ప్రభుత్వం అనుమతిలేకున్నా మేకదాటు ప్రాజెక్టు (cauvery water) నిర్మాణం కోసం పాదయాత్ర చేశారని మాజీ సీఎం కుమారస్వామి (kumaraswamy)కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వానికి గుర్తు చేశారు.

ఆరోజు కావేరి నీటిని అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేకదాటు ప్రాజెక్టు కోసం పాదయాత్రలు చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కావేరి నీరు (cauvery water)గురించి పట్టించుకోవడం లేదని కుమాస్వామి (kumaraswamy) ఆరోపించారు. కావేరి జలాలు (cauvery water) తమిళనాడుకు విడుదల చెయ్యకూడదని డిమాండ్ (Bengaluru)చేస్తూ ఈరోజు కావేరి జలాల కోసం వీధుల్లో పోరాటం చేస్తున్న రైతులను, కన్నడ సంఘాల కార్యకర్తలను సిద్దరామయ్య ప్రభుత్వం అరెస్టు చేసిందని కుమారస్వామి ఆరోపించారు.

రైతులు, కన్నడ సంఘాల కార్యకర్తలు రాత్రికి రాత్రే ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు చేశారని కుమారస్వామి విరుచుకుపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఒక న్యాయమైతే, కావేరీ నీటి (cauvery water)విడుదలను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన కన్నడిగులకు మరో న్యాయమా? ఇది కన్నడిగుల ప్రభుత్వమా? స్టాలిన్ ఆధ్వర్యంలో కర్ణాటకలో ఉన్న డూప్లికేట్ ప్రభుత్వమా అంటూ కుమారస్వామి (kumaraswamy) కాంగ్రెస్ ను ప్రశ్నించారు.
కన్నడిగులు ఎవరికి ఓటు వేశారు? అని బహిరంగంగా సిద్దరామయ్య ప్రభుత్వం చెప్పాలని కుమారస్వామి (kumaraswamy) ఘాటుగా అడిగారు. పోలీసులు వెంటనే ఉద్యమకారులను, రైతులను విడుదల చేయాలి. తమిళనాడుకు వెంటనే కావేరీ నీటిని (cauvery water)ఆపాలని. కాంగ్రెస్ పార్టీ డీఎంకే పార్టీకి మద్దతుగా మారడం వల్లే ఈ కావేరీ సంక్షోభం ఏర్పడిందని కన్నడిగులకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైందని కుమారస్వామి (kumaraswamy)ఆరోపించారు.

హెచ్‌డి కుమారస్వామి (kumaraswamy)తన ట్వీట్‌లో బెంగుళూరు (Bengaluru)బంద్, కావేరీ మాదే అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్వీట్ చేశారు. అంతకుముందు మరో ట్వీట్‌లో బెంగళూరు బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. అయితే పోరాటం శాంతియుతంగా సాగాలని, బంద్ విజయవంతం కావాలని, జేడీఎస్ పార్టీ కార్యకర్తలు కూడా బంద్‌లో చురుగ్గా పాల్గొంటారని మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు.












Click it and Unblock the Notifications