ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం.. ఐసీయూలో చికిత్స..
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ(92) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఏప్రిల్ 29న ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తీవ్ర అనార్యోగంతో భాదపడుతున్న ఆయన గత నెల 21వ తేదిన బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చేరారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏప్రిల్ 29న మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చిక్సిత పొందుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలక పాత్ర పోషించారు. పార్టీలో ఆయన ఎన్నో కీలక పదవుల్లో కూడా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. అక్కడ ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత గవర్నర్ పదవిని చేపట్టారు.

కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. గత సంవత్సరం మాజీ సీఎం క్రీయాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వయసు దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. అయితే, ఆయన రాజకీయాలను వీడాలనుకున్న విషయాన్ని బీజేపీ పెద్దగా పట్టించుకోలేదని ఆ సమయంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటక సీఎం పరామర్శ..
గత నెల రోజులుగా ఆయన తీవ్ర ఆనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ సునీల్ కారంత్ నేతృత్వంలోని క్రిటికల్ కేర్ టీమ్ మాజీ సీఎంకు చికిత్స అందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి ఆయనను పలకరించడం జరిగింది. అలాగే ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications