మోదీ ర్యాలీ, ఒక్కసారిగా ఝలక్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ మాజీ సీఎం, మేడమ్ దెబ్బతో!
భోపాల్/మధ్యప్రదేశ్: ప్రధాని నరేంద్ర మోదీని (modi) ప్రతిపక్షాలు తప్పా సొంత పార్టీ బీజేపీలో (bjp) ఆయన్ను ఎదిరించడానికి ఎవ్వరూ సాహసం చెయ్యరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది మాజీ సీఎం, ఫైర్ బ్రాండ్ ఉమాభారతి (umabharti)ప్రధాని నరేంద్ర మోదీ (modi) పర్యటన సందర్బంగా ఆయనకు స్వాగతం చెబుతూనే ఊహించని షాక్ ఇచ్చారు.
మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. మధ్యప్రదేశ్ లో అధికారం సొంతం చేసుకోవాలని బీజేపీ (bjp), కాంగ్రెస్ (congress) పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీని (bjp) అధికారంలోకి తీసుకురాలని ప్రధాని నరేంద్ర మోదీ (modi) రంగంలోకి దిగారు. అయితే మధ్యప్రదేశ్ లో బీజేపీకి అంతగా అనుకూల పవనాలు లేవని స్థానిక ప్రజలు అంటున్నారని తెలిసింది.

సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ (modi)భోపాల్ పరట్యనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంలో మాజీ సీఎం, ఫైర్ బ్రాండ్ ఉమాభారతి (umabharti) చేసిన ట్విట్ వైరల్ అవుతోంది. భోపాల్ భూమి మీద అడుగుపెడుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి (modi) ఘనస్వాగతం, మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన మోదీ గారు ఓబీసీ మహిళలకు కూడా ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని మనవి చేస్తున్నానని ఎక్స్ లో ఉమాభారతి (umabharti) ట్విట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ (modi) ఓబీసీ మహిళలకు ప్రత్యే రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటారని తాను బావిస్తున్నానని, ఆయన మహిళలకు న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందని మాజీ సీఎం ఉమాభారతి (umabharti) ట్విట్ చెయ్యడంతో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్ పర్యటనకు కొన్ని గంటల ముందే ఉమాభారతి (umabharti) ఎక్స్ లో ఈ ట్విట్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
సాగర్ లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఉమాభారతి (umabharti) తాను ఐదు సంవత్సరాలు మాత్రమే రాజకీయాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకున్నానని, తాను రాజకీయాలకు పూర్తిగా దూరం కాలేదని పదేపదే చెబుతున్నానని, అయితే ఇదే విషయంలో మీడియా లేనిపోని ప్రచారాలు చేస్తోందని, తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని ఉమాభారతి (umabharti) స్పష్టం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో కూడా పోటీ చెయ్యాలని మాజీ సీఎం, బీజేపీకి (bjp) దూరంగా ఉంటున్న ఫైర్ బ్రాండ్ ఉమాభారతి (umabharti) ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications