హార్దిక్ పటేల్ బీజేపీలోకి చేరికకు ముహూర్తం ఖరారు: స్వాగతం పలకనున్న రాష్ట్ర పార్టీ నేతలు
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, పాటిదార్ కోటా ఉద్యమ నేత హార్దిక్ పటేల్ గురువారం(జూన్ 2) మధ్యాహ్నం 12 గంటలకు గుజరాత్ పార్టీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్టీలో చేరనున్నట్లు వార్తా సంస్థ ఐయాన్స్ నివేదించింది.
జూన్ 2న రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ సమక్షంలో హార్దిక్ పటేల్ బీజేపీలో చేరడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యగ్నేష్ దవే మంగళవారం పీటీఐకి తెలిపారు. కాగా, హార్దిక్ పటేల్ 2019లో కాంగ్రెస్‌లో చేరారు.

మే 18న కాంగ్రెస్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి పటేల్ వివిధ వేదికలపై కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ "పాటిదార్ వ్యతిరేకం, గుజరాత్ వ్యతిరేకం" అని పేర్కొన్నారు.
2015లో గుజరాత్‌లో పాటిదార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ వెలుగులోకి వచ్చారు. జూలై 2020లో ఆయన గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత హార్దిక్ పటేల్ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి హిందువులన్నా.. హిందూ దేవతలన్నా ఎందుకంత ద్వేషమని మండిపడ్డారు హార్దిక్ పటేల్. హార్దిక్ పటేల్ వరుస ట్వీట్లలో.. "ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, హిందూ మత విశ్వాసాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుందని నేను ఇంతకుముందు కూడా చెప్పాను అని అన్నారు. శ్రీరాముడితో మీకు ఎలాంటి శత్రుత్వం ఉందని నేను కాంగ్రెస్, దాని నాయకులను అడగాలనుకుంటున్నాను? హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తారు? శతాబ్దాల తర్వాత, అయోధ్యలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మిస్తున్నారు, అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. శ్రీరాముడికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలపై హార్దిక్ పటేల్ ధ్వజమెత్తారు.
దేశంలోని కొన్ని కీలక సమస్యలపై కాంగ్రెస్ "రోడ్‌బ్లాక్ పాత్రను మాత్రమే పోషించింది", "కేవలం ప్రతిదానిని వ్యతిరేకించే స్థాయికి దిగజారిపోయింది" అని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖలో హార్దిక్ పటేల్ ఆరోపించారు.
గుజరాత్ ప్రజల సమస్యలను తాను లేవనెత్తినప్పుడల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ మొబైల్ ఫోన్‌లలో సందేశాలను తనిఖీ చేయడంలో బిజీగా ఉన్నారని, పార్టీకి, దేశానికి అవసరమైనప్పుడు కొంతమంది నాయకులు "విదేశాలలో ఆనందిస్తున్నారు" అని హార్దిక్ పటేల్.. పరోక్షంగా రాహుల్ గాంధీని కూడా విమర్శించారు.












Click it and Unblock the Notifications