ఇసిస్: గూగుల్ మాజీ టెక్కీ బైండోవర్, సోషల్ సైట్‌ల వల్లే

న్యూఢిల్లీ: గతంలో గూగుల్ సంస్థలో పని చేసిన వ్యక్తి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ (ఇసిస్) వైపు ఆకర్షితుడయ్యాడనే అభియోగాలతో అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం మానేసి ఇసిస్‌లో చేరేందుకు ఆరా తీశాడు. ఇస్లామిక్ స్టేట్ స్థాపన దిశగా సాగిన అతడి ఆలోచనలు పలువురు యువకులు 'ఇసిస్'పై దృష్టి సారించేందుకు దోహదపడ్డాయి. దీనిపై పోలీసుల అప్రమత్తమై అతనిని బైండోవర్ చేశారు.

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నివాసముండే గూగుల్ మాజీ ఉద్యోగి మునావాద్ సల్మాన్ కదలికలపై కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. అతనిని మంగళవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇసిస్‌లో చేరేందుకు అతడు చేసిన యత్నాలను నిర్ధారించుకున్న మీదటే అతడిని పోలీసులు బైండోవర్ చేశారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. అతడిని విచారిస్తే పలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

మునావాద్ సల్మాన్ వయస్సు 30. ఇతని స్వస్థలం తమిళనాడు. ఇతను సోషల్ మీడియా ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఇసిసి) పట్ల ఆకర్షితుడయ్యాని, అందులో చేరాలనుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు.

Former Google employee held for trying to join ISIS

మునావద్ సల్మాన్ గతంలో హైదరాబాదులోని జెయింట్ గూగుల్ కార్యాలయంలో పని చేశాడు. అనంతరం ఇసిస్ పట్ల ఆకర్షితుడై ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇతను ఏడు నెలల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అతను సౌది అరేబియాకు వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నాలు చేశాడు. అక్కడి నుండి ఇరాక్ వెళ్లేందుకు ప్రణాళిక తయారు చేసుకున్నాడని సమాచారం.

మునావాద్ సల్మాన్‌ను తాము మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని, అతనికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి పీటీఐతో తెలిపారు. ఇసిస్ సమాచారానికి అతనిని దూరంగా ఉంచుతున్నారు. అతని పైన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు అతను కేవలం అట్రాక్ట్ మాత్రమే అయ్యాడని, మరోసారి ఇలాంటి వాటికి మొగ్గు చూపితే కేసు నమోదు చేయనున్నారు.

కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం: సీపీ

ఇసిస్ వైపు కొందరు యువకులు ఆకర్షితులవుతున్నారని, వారికి వారి కుటుంబ సభ్యుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇసిస్ వైపు ఆకర్షితులవుతున్న వారిని బైండోవర్ చేస్తున్నామన్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల వల్లనే వారు ఇసిస్ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. అయితే, ఇప్పటి వరకు ఇసిస్‌లో ఎవరు చేరలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+