మాజీ సీఎంలు శెట్టర్, కుమారస్వామికి ఓటర్లు షాక్, దూసుకుపోతున్న గాలి !

బెంగళూరు/హుబ్బళి/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా మారుతోంది, బీజేపీ నుంచి బయటకు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్, మాజీ మంత్రి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మొదటి రౌండ్ లోనే సత్తా చాటుకున్నారు. హుబ్బళి-ధారవాడ లో మొదటి రౌండ్ లో జగదీష్ శెట్టర్ సత్తా చాటుకున్నారు.

అయితే రానురాను మాజీ సీఎం జగదీష్ శెట్టర్ వెనక్కి పడిపోవడంతో బీజేపీ అభ్యర్థి మహేష్ టింగినకాయ దూసుకుపోతున్నారు. హుబ్బళి -ధారవాడ సెంట్రల్ నియోజక వర్గంలో ఎలాగైనా గెలవాలని బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరి ఎన్నికల్లో పోటీ చేసిన జగదీష్ శెట్టర్ కు ఇప్పుడు హైటెన్షన్ మొదలైయ్యింది.

Karnataka Assembly Election Results 2023

బీజేపీ నుంచి బయటకు వచ్చి కేఆర్ పీ పార్టీ పెట్టి కోప్పళ జిల్లాలోని గంగావతి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఆ నియోజక వర్గంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులను వెనక్కి నెట్టి భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. గంగావతిలో తాను కచ్చితంగా గెలుస్తానని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రామనగర జిల్లాలోని చెన్నప్పట్టణ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మాజీ సీఎం, జేడీఎస్ దళపతికి హెచ్ డీ. కుమారస్వామికి స్థానికులు షాక్ ఇచ్చారు. మొదటి రౌండ్ లోనే చెన్నపట్టణలో బీజేపీ అభ్యర్థి సీపీ యోగేశ్వర్ కు దూసుకుపోతున్నారు. మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి చెన్నపట్టణలో ఎక్కువగా ప్రచారం చెయ్యకుండా రాష్ట్రం మొత్తం తిరిగారు.

Karnataka Assembly Election Results 2023

అభిమానుల, జేడీఎస్ నాయకులను నమ్ముకుని ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేసిన మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామికి స్థానిక ఓటర్లు ఊహించని షాక్ ఇస్తున్నారు. ఇక కోలారు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి వర్తూరు ప్రకాష్ కు స్థానిక ఓటర్లు షాక్ ఇచ్చారు.

కోలారుకు వలస వెళ్లి ఇష్టం లేకున్నా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తూరు మంజునాథ్ మెజారిటీ ఓట్లు సంపాధిస్తూ దూసుకుపోతున్నారు. కర్ణాటకలోని పలు నియోజక వర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+