వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనే భార్యను, ఆయన్ను వదిలేది లేదు: బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ప్రేమకుమారి హంగామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బీజేపీ ఎమ్మెల్యే రామదాస్ కార్యాలయం ఎదుట గురువారం ప్రేమలత అనే మహిళ ధర్నాకు దిగారు. తాను అతని ప్రియురాలిని అని చెప్పారు. నేను అతనిని వదిలి పెట్టనని, నేను అతని భార్యనని, నేను అతనిని ఎంతో ప్రేమించానని, అతను ఎలాంటి తప్పు చేయకుంటే నన్ను ఎందుకు తప్పించుకుంటున్నాడని ప్రశ్నించింది.

ఎమ్మెల్యే నివాస ఎదుట ధర్నాకు దిగిన మహిళ పేరు ప్రేమకుమారి. రామదాసు ప్రియురాలిగా వార్తల్లోకి ఎక్కారు. ఎన్నికల సమయంలోను కొంత హంగామా చేశారు. ఇప్పుడు మళ్లీ రామదాసు కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

Former lover storms MLAs Mysuru home

రామదాసు తన భర్త అని, తాను బతికున్నంత కాలం అతనితోనే జీవిస్తానని ప్రేమకుమారి తెలిపారు. ఎన్నికల్లో కూడా రామదాసు కోసమే పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తన నుంచి తప్పించుకొని తిరుగుతున్నారన్నారు. ఆయనతో తాడోపేడో తేల్చుకుంటానని చెప్పారు. రామదాసుకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తానన్నారు.

ప్రేమకుమారి గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు రామదాసు నివాసానికి వచ్చారు. అక్కడున్న సిబ్బంది రామదాసు లేడని చెప్పారు. దీనిపై ఆమె ఊగిపోయారు. నేను బతికున్నంత కాలం రామదాసును వదిలేది లేదని హెచ్చరించారు. కాగా, రామదాసు మైసురూ కృష్ణరాజ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

English summary
SA Ramadas, the BJP MLA from Krishnaraja in Mysuru, was caught in an embarrassing situation after a woman, said to be his former girlfriend, created ruckus outside his office-cum-residence on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X