అమ్మాయిల కిడ్నాప్: బీజేపీ ఎమ్మెల్యే నాలుక కట్ చేస్తే రూ. 5 లక్షలు ఇస్తా, బంపర్ ఆఫర్!
ముంబై: ప్రతినిత్యం పదేపదే వివాదాస్పాద వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ నాలుక కత్తిరించిన వారికి రూ. 5 లక్షలు బహుమతిగా ఇస్తానని మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుభోద్ సాయోజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు ఇదే బంపర్ ఆఫర్ అంటూ మాజీ మంత్రి అంటున్నారు.
శాసన సభ్యుడి హోదాలో ఉంటూ బహిరంగంగా అమ్మాయిలను కిడ్నాప్ చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఎలా చెబుతారని మాజీ మంత్రి సుభోద్ సాయోజీ ప్రశ్నించారు. రామ్ కదమ్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని మాజీ మంత్రి సుభోద్ సాయోజీ డిమాండ్ చేశారు.

చట్టానికి, రాజ్యాంగానికి విలువ ఇవ్వని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఆయనకు ఓటు వేసిన ప్రజలకు, మహిళలకు ఎలా న్యాయం చేస్తారని మాజీ మంత్రి సుభోద్ సాయోజీ ప్రశ్నించారు. రామ్ కమద్ లాంటి వ్యక్తిని బీజేపీ నాయకులు వెనుకవేసుకుని రావడం సిగ్గుచోటు అని సుభోద్ సాయోజీ మండిపడ్డారు.
సోమవారం రాత్రి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మాట్లాడుతూ మీరు ప్రేమించిన అమ్మాయిలు పెళ్లికి నిరాకరిస్తే తాను కిడ్నాప్ చేసి అయినా మీ వివాహం జరిపిస్తానని వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు.

రామ్ కదమ్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు మొదలైనాయి. తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టారని, తనను క్షమించాలని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఇప్పటికే చెప్పారు. అమ్మాయిలను కిడ్నాప్ చేస్తానని చెప్పిన రామ్ కదమ్ కు మీరు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర మహిళా కమీషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications