బీజేపీ గూటికి మాజీ సీఎం కుమారుడు: కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంతం చూడాలని కంకణం కట్టుకున్న ఆ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప సోనియా గాంధీకి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, సినీ నటుడు కుమార బంగారప్పను బీజేపీలో చేర్చుకోవడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడైన కుమార బంగారప్ప గతంలో కర్ణాటక మంత్రిగా పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప 74వ పుట్టిన రోజు వేడుకల సందర్బంగా కుమార బంగారప్ప ఆయన ఇంటికి వెళ్లారు.

శివమొగ్గ జిల్లాలోని సోరబ శాసన సభ నియోజక వర్గంలో కుమార బంగారప్పకు మంచి పట్టుఉంది. బీఎస్. యడ్యూరప్ప పుట్టిన రోజు సందర్బంగా కుమార బంగారప్ప బెంగళూరు చేరుకుని యడ్యూరప్పను కలుసుకున్నారు.

Former Minister Kumar Bangarappa have met Karnataka BJP state president BS Yeddyurappa

తరువాత పుట్టి రోజు శుభాకాంక్షలు చెప్పి ఆయన హుషారుగా బయటకు వచ్చారు. అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలోనే రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తన నియోజక వర్గ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని మంచి నిర్ణయం తీసుకుంటానని మీడియాకు చెప్పారు.

మీరు బీజేపీలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి కదా ? అని మీడియా ప్రశ్నిస్నే త్వరలో ఏమైనా జరగవచ్చు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాను త్వరలో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తానని, కాంగ్రెస్ ను అంతం చేస్తానని యడ్యూరప్ప పదేపదే చెబుతున్న సమయంలో కుమార బంగారప్ప ఆయన్ను కలుసుకుని కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+