వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త హత్య కేసులో నిందితులను హత్య చేయించిన భార్య, చివరికిలా చేసింది

మాజీ మంత్రి విఎంసి శివకుమార్ హత్య కేసులో ప్రధాన నిందితురాలుఆర్ .ఎళలరసి కోర్టులో లొంగిపోయారు. తన భర్త హత్యకు ప్రతీకారంగానే ఆమె మూడు హత్యలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:పుదుచ్చేరి మాజీ మంత్రి విఎంసి శివకుమార్ హత్య కేసులో ప్రధాననిందితురాలు ఆర్ ఎళిలరసి పుదువై జ్యూడిషీయల్ మూడవ మేజిస్ట్రేట్ ధనలక్ష్మి ఎదుట లొంగిపోయారు.

పుదుచ్చేరి మాజీ మంత్రి విఎంసి శివకుమార్ ఇటీవలే హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు.

అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తోన్న ఆర్ ఎళిలరసి పుదువై జ్యూడిషీయల్ మేజిస్ట్రేట్ మూడో కోర్టు న్యాయమూర్తి ధనలక్ష్మి ఎదుట లొంగిపోయారు.అయితే ఆమె ఈ నేరం చేసినట్టుగా అంగీకరించింది.

former minister shivakumar murder case accused surrender in court

నిందితురాలు లిక్కర్ కింగ్ రాము అలియాస్ రాధాకృష్ణ రెండో భార్యగా గుర్తించారు పోలీసులు. రామును 2013 లో కొందరు హత్య చేశారు. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకొనే క్రమంలోనే ఆమె కొందరితో ముఠాను ఏర్పాటు చేసింది.

ఈ ముఠా 2014 లో ట్రావెట్ ఏజెంట్ అయ్యప్పనన్ నుహత్య చేసింది. ఆ తర్వాత 2015 లో రాము మొదటి బార్య వినోదను కూడ చంపేసింది. వీరిద్దరి రాము హత్య కేసులో ప్రధానపాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి.

వీరిద్దరితో పాటుగా మాజీ మంత్రి విఎంసి శివకుమార్ కూడ ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.పోలీసుల విచారణలో కూడ ఇదే తేలింది. దీంతో మాజీ మంత్రి శివకుమార్ ను కూడ ఈ ముఠా హత్య చేసింది.

తన భర్తను హత్య చేసినవారిని అంతమొందించిన తర్వాత ఆమె కోర్టులో లొంగిపోయింది. ఈ నేరాలను తానే చేసినట్టు అంగీకరించిందని పోలీసులు చెప్పారు.

English summary
former minister shivakumar murder case accused surrender in court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X