మైండ్ బ్లాక్, ఐటీ హబ్ మాజీ మంత్రులు జంప్, అధికార పార్టీకి, సీఎంకు జేజేలు, గల్లీ దెబ్బకు ఢిల్లీలో జలక్ !
బెంగళూరు: సొంత పార్టీలో ఎలాంటి హోదా రాకుండా రోజురోజుకు హైకమాండ్ కాలం గడిపేయడంతో కర్ణాటక మాజీ మంత్రులు వీ సోమన్న, అరవింద్ లింబావళి కాంగ్రెస్‌లో చేరతారని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాల మధ్య కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ పరమేశ్వర్ బాంబు పేల్చారు.
బీజేపీ అసంతృప్తి నేతలు వీ.సోమన్న, అరవింద్ లింబావళి పాత పార్టీకే చేరువవుతున్నారనే సంకేతాలను కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వర్ స్వయంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరడంపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్థాయిలో చర్చించనున్నారని, అన్ని వివరాలు త్వరలో చెబుతామని డాక్టర్ పరమేశ్వర్ అన్నారు.

వీసోమన్న నన్ను ఓ కార్యక్రమానికి ఆహ్వానించారు. డిసెంబర్ 6వ తేదీన జరిగే ఆ ఫంక్షన్‌కి ేను హాజరవుతానని చెప్పానని పరమేశ్ర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయం నుండి బీజేపీ సీనియర్ నాయకుడు సోమన్న ఆయన సొంత పార్టీపై అసంతృప్తిగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా సీనియారిటీ ఉన్నా ఆయనకు బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని అనుకున్నారు.
అయితే బీజేపీ హైకమాండ్ సోమన్నను పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్‌పై ఆశ లేకపోవడంతో డిసెంబర్ 6వ తేదీ వరకు ఆగాలని సోమన్న ఓ నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవరని తెలిసి కూడా వరుణ అసెంబ్లీ నియోజక వర్గంలో, చామరాజగనర నియోజక వర్గంలో రెండు చోట్ల బీజేపీ హైకమాండ్ సోమన్న టిక్కెట్లు ఇవ్వడంతో ఆరెండు చోట్ల ఓడిపోయారు.

ఆ తర్వాత పార్టీలో సముచిత హోదా రాకపోవడంతో సోమన్న కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్ష పదవిని బీఎస్ యడ్యూరప్ప కుమారుడికి ఇచ్చినట్లే తన కుమారుడికి పార్టీలో హోదా ఇవ్వాలని కొంతకాలంగా సోమన్న బీజేపీ పెద్దలకు చెబుతున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం మాజీ మంత్రి వీ. సోమన్నను గౌరవించినట్లు కనిపించడం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.
అందుకే మాజీ మంత్రి సోమన్న బీజేపీని వీడే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆయనలాగే మరో సీనియర్ బీజేపీ నేత, ఆర్‌ఎస్‌ఎస్‌తో సన్నిహితంగా ఉండే దళిత నేత, కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావళికి కూడా ఆ పార్టీ అన్యాయం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి అరవింద్ లింబావలికి కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లోఆాయన భార్యకు సీటు ఇచ్చారు.

ప్రస్తుతం అరవింద్ లింబావలి భార్య బెంగళూరులోని మహదేవపుర నియోజక వర్గం ఎమ్మెల్యే. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా లింబావలి భార్యకు టిక్కెట్ ఇచ్చినప్పటికీ లింబావలికి మాత్రం బీజేపీలో సముచిత హోదా వస్తుందని అంతా భావించారు. ఇప్పుడు అరవింద్ లింబావలికి సరైన హోదాలేదని ఆయన అసహనంతో ఉన్నారని తెలిసింది
మాజీ మంత్రి వీ సోమన్నతో పాటు మాజీ మంత్రి అరవింద్ లింబావలి త్వరలో కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అరవింద్ లింబావలి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ప్రశంసలు కురిపించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సిద్ధరామయ్య ఎంతో కృషి చేస్తున్నారని మాజీ మంత్రి అరవింద్ లింబావలి అన్నారు.
ఇప్పుడు సిద్ధరామయ్యను పొగిడిన లింబావలి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్యతో చర్చలు జరిపిన సోమన్న డిసెంబర్ 15వ తేదీ తర్వాత బెళగావిలో శీతాకాల సమావేశాల అనంతరం కాంగ్రెస్‌లో చేరతారని పుకార్లు వినిపిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ, జేడీఎస్ పార్టీల అసంతృప్త నేతలపై కాంగ్రెస్ పార్టీ కన్ను వేసింది.
-
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications