ఫైర్ బ్రాండ్ ఎంపీకి ఫైర్ బ్రాండ్ మాస్ లీడర్ పోటీ, మధ్యలో సౌమ్యా రెడ్డి, సౌత్ లో వాస్తు సరిపోయింది !
లోక్‌సభ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల వేడి బాగానే ఉంది. కన్నడ ఉద్యమ పోరాటాలకు ముందుండే వాటల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటాల్ నాగరాజ్ బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగడం హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు సౌత్ నుంచి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యాపై మజీ ఎమ్మెల్యే వాటాల్ నాగరాజ్ పోటీ చేయనున్నారు. ఏం చేసినా, ఎలాంటి పోరాటాలు చేసినా, కన్నడ కోసం ఆందోళన చేసినా సందడి చేసే వాటల్ నాగరాజ్ ఓ ఆటోరిక్షాలో వచ్చి బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజకవర్గం ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. బెంగళూరు సౌత్ నుంచి వాటల్ నాగరాజ్ పోటీలో ఉన్నారు.

ఇదే నియోజక వర్గం నుంచి తేజస్వి సూర్యా పోటీ చేస్తున్నారు. బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం ప్రస్తుత ఎంపీ కూడా తేజస్వి సూర్యా మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా బీజేపీ సిట్టింగ్ ఎంపీ తేజస్వి సూర్యానే పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియోజక వర్గం నుంచి బెంగళూరు నగరంలోని జయనగర మాజీ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు.
బెంగళూరు సౌత్ నియోజక వర్గంలో ఈసారి కచ్చితంగా హోరాహోరీ పోరు తప్పదు అని ఓటర్లు అంటున్నారు. దీంతో పాటు కన్నడ చలువళి వాటల్ పార్టీ అధ్యక్షుడు వాటల్ నాగరాజ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానానికి కన్నడ ఉద్యమ నేత, కన్నడ ఉద్యమాలకు పెట్టింది పేరు అని గుర్తింపు తెచ్చుకున్న వాటాల్ నాగరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. కన్నడిగుల కోసం వాటాల్ నాగరాజ్ 65 ఏళ్ల వయసులో కూడా సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు.
ಈಡುಗಾಯಿ ಒಡೆಯುವ ಕಾರ್ಯಕ್ರಮ. pic.twitter.com/cbKJkHNLKD
— ಶ್ರೀ ವಾಟಾಳ್ ನಾಗರಾಜ್ (@VatalNagaraj) April 6, 2024
కన్నడ ఉద్యమ పోరాటం, కావేరీ పోరాటం, మహదాయి పోరాటం, బెళగావి సరిహద్దు పోరాటంతో సహా కన్నడిగుల కోసం అసెంబ్లీలో పోరాటం వివాదాలు చేశారు. వాటల్ నాగరాజ్ ఇంతకాలం ఎవరితోనూ రాజీపడకుండా జీవితాంతం కన్నడిగుల కోసం పోరాడుతూనే ఉన్నారు. అధికారం కోసం తన రాజకీయ జీవితాన్ని ఎవరికీ తాకట్టు పెట్టలేనని వాటల్ నాగరాజ్ అంటున్నారు. వాటల్ నాగరాజ్ పోరాటం చేసే సమయంలో వింతవింతగా ఆయన ఆందోళనలు చేస్తుండటంతో కర్ణాటకలో ఆయన పేరు తెలీని కన్నడిగులు లేడు.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!











Click it and Unblock the Notifications