అప్పుడే ముంబై మోడల్‌కు బాయ్‌ఫ్రెండ్ చేయిచ్చాడట!

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో 26 ఏళ్ల మాజీ మోడల్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అర్చన పాండే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వెర్సోరా పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... వారికి ఉదయం పదిన్నర గంటలకు ఫోన్ వచ్చింది. అక్కడకు వెళ్లిన పోలీసులకు బెడ్రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని అర్చన పాండే కనిపించింది.

వెర్సోరా పోలీసు స్టేషన్ సీనియర్ పోలీసు ఇన్స్‌పెక్టర్ అరుంధతి రాణే మాట్లాడుతూ.. అర్చన పాండే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా.. అర్చనా పాండే ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా పని చేస్తూ బాగానే సంపాదిస్తోందని, ఆమెకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని భావిస్తున్నారు. అయితే, తన సోదరుడు అశ్విన్ పాండే ఇంటర్నేషనల్ చీటింగ్ స్కాంలో ఇరుక్కొని గుజరాత్ క్రైం బ్రాంచ్ పోలీసులచే అరెస్టైన నేపథ్యంలో ఆమె ఒత్తిడికి లోనై ఉంటుందని అంటున్నారు.

Former model commits suicide, boyfriend in trouble!

తన సోదరుడికి బెయిల్ ఇప్పించేందుకు అర్చన పాండే తరుచూ గుజరాత్ వెళ్లి వస్తుండేదని తెలుస్తోంది. తన సోదరుడికి బెయిల్ విషయంలో సహకరించాలని అర్చన పాండే తన బాయ్ ఫ్రెడ్ ఉమర్ పతన్‌ను కోరినట్లుగా తెలుస్తోంది. అయితే, అతను మాత్రం ఆమెను దూరం పెట్టినట్లుగా తెలుస్తోంది.

అర్చన పాండే తన సూసైడ్ నోట్లో.. తనకు అవసరమైన సమయంలో తన బాయ్ ఫ్రెండ్ దూరం పెట్టారని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఉమర్ పతన్, మరో మహిళ సనలు తనకు వారి సహాయం చాలా అవసరమైన సమయంలో దూరం జరిగారని నోట్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+