మరో వివాదంలో మాజీ ఎంపీ రమ్య: యువకుడితో వాగ్వాదం..

ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన హామిపై చిక్కామురళి అనే యువకుడు మాజీ ఎంపీ రమ్యను నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

మండ్య : ఎంపీగా ఉన్న సమయంలో ఇచ్చిన ఓ హామికి కట్టుబడి ఉండాలంటూ.. ఓ యువకుడు మాజీ కాంగ్రెస్ ఎంపీ రమ్యను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. యువకుడిపై రమ్య అనుచరులు దాడి చేశారు. గమనించిన స్థానికులు దాడి నుంచి అతన్ని రక్షించారు.

అసలు విషయమేంటంటే.. మండ్య నియోజకవర్గ ఎంపీగా ఉన్న సమయంలో వన్ ఇండియా వన్ ఎంపీ కార్యక్రమంలో ప్రారంభించారు రమ్య. కార్యక్రమంలో భాగంగా.. సామాజిక స్థితిగతులు, ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై థీసిస్ రాసినవారికి రూ.2.5 లక్షల బహుమానం ఇస్తామని ప్రకటించారు. దీంతో దాదాపు 117మంది యువకులు అనేకానేక సమస్యలపై, వాటి పరిష్కార మార్గాలపై థీసిస్ రాసి సమర్పించారు.

అలా థీసిస్ సమర్పించినవారిలో చిక్కమురళి గ్రామానికి చెందిన పాండుదురై ఒకరు. థీసిస్ అయితే సమర్పించారు గానీ అనంతరం జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో రమ్య ఓడిపోవడంతో.. ఆ థీసిస్ ను ఆమె పట్టించుకోలేదు. దీంతో రమ్యను ఎలాగైనా కలవాలని పాండుదురై చాలాసార్లు విఫల ప్రయత్నాలు చేశాడు.

Former MP Ramya in another controversy!

ఇదే క్రమంలో సోమవారం నాడు మండ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రమ్య వస్తున్నట్టుగా సమాచారం అందుకున్నాడు పాండుదురై. కలెక్టరేట్ వద్దకు చేరుకుని రమ్యను నిలదీశాడు. ప్రస్తుతం తాను ఎంపీని కాదని, ప్రస్తుత ఎంపీని లేదా కలెక్టర్ ను దీనిపై సమాధానం అడగాలని బదులిచ్చారు రమ్య.

దీంతో తీవ్ర అసహనానికి గురైన చిక్కమురళి.. బహుమానం లేకపోయినా పరవాలేదు తనను గుర్తించాలని పట్టుబట్టాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన రమ్య.. నువ్వో రౌడీలా వ్యవహరిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలోనే రమ్య అనుచరులు చిక్కామురళిపై దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు, పోలీసులు జోక్యం చేసుకుని యువకుడిని విడిపించారు. అనంతరం స్థానికులంతా ఏకమై రమ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+