కరోనా కాటు: 26/11 ఉగ్రదాడికి కౌంటర్ ఆపరేషన్ లీడ్ చేసిన మాజీ ఎన్ఎస్జీ చీఫ్ జేకే దత్ కన్నుమూత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో మరిన్ని ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే దేశంలో 2 లక్షల మందికిపైగా చంపేసింది. తాజాగా, ఎన్ఎస్జీ మాజీ డీజీ, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ జేక్ దత్ కరోనా బారినపడి బుధవారం కన్నుమూశారు. మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం వదిలారు.
26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో కౌంటర్ రెస్క్యూ ఆపరేషన్ బ్లాక్ టోర్నడో అప్పటి ఎన్ఎస్జీ చీఫ్ జేకే దత్ నేతృత్వంలోనే జరిగింది. అసాంఘిక శక్తులతో పోరాడటంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని సీఆర్పీఎఫ్ ఏడీజీ జుల్ఫికర్ హసన్ తెలిపారు. తన కేడర్ తోపాటు సెంట్రల్ డిప్యూటేషన్లలోనూ రాణించారని తెలిపారు.

జేకే దత్.. ఇండియన్ పోలీస్ సర్వీస్ 1971 బ్యాచ్. ఈయన పశ్చిమబెంగాల్ కేడర్ నుంచి వచ్చారు. దత్.. సీబీఐ తోపాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ పోర్స్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. సీబీఐలో పనిచేసిన కాలంలో చాలా సెన్సిటివ్ కేసులను ఎదుర్కొన్నారు.
Sh Jyoti Krishan Dutt IPS ,former DG NSG ( Aug 2006- Feb 2009) passed away today on 19th May at Gurugram. NSG condoles the sad and untimely demise of former DG and remembers his distinguished service to the Nation . pic.twitter.com/qhBj4JnjwB
— National Security Guard (@nsgblackcats) May 19, 2021
ఆగస్టు 8న ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేబినెట్ నియామక కమిటీ ఆయన పేరును క్లియర్ చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి దత్ పోస్టు గ్రాడ్యూయేట్ పట్టా పొందారు. ఆయన పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అందుకున్నారు. అంతేగాక, దత్ విశిష్ట సేవలకు గానూ పెసిడెంట్స్ పోలీస్ మెడల్ కూడా అందుకున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications