జయలలిత పార్టీకి నాటి అందాల నటి ప్రచారం (పిక్చర్స్)
చెన్నై: 2014 సార్వత్రిక ఎన్నికలలో ఎఐఎడిఎంకె తరఫున అలనాటి అందాల నటి వెన్నిరాడై నిర్మల ప్రచారం చేయనున్నారు. నిర్మలతో పాటు పలువురు నటులు, దర్శకులు, కమెడియన్లు, విలన్లు ప్రచారం చేయనున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని ఎఐఎడిఎంకె ప్రచారకుల జాబితాను ప్రకటించింది. ఎన్నికల్లో ప్రచారం చేయనున్న 19 మందితో కూడిన స్టార్ ప్రచారకుల జాబితాలో వెన్నిరాడై నిర్మలతో పాటు నటులు, దర్శకులు, కమెడియన్లు, విలన్లు ఉన్నారు.
జయలలిత, వెన్నిరాడై నిర్మల ఇద్దరూ కూడా దాదాపు ఒకే సమయంలో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో 11వ తేదీ నుంచి ఆమె ప్రచారం చేస్తారని అన్నాడిఎంకె పార్టీ ప్రకటించింది.

ప్రచార కమిటీ
2014 సార్వత్రిక ఎన్నికలలో ఎఐఎడిఎంకె తరఫున అలనాటి అందాల నటి వెన్నిరాడై నిర్మల ప్రచారం చేయనున్నారు. నిర్మలతో పాటు పలువురు నటులు, దర్శకులు, కమెడియన్లు, విలన్లు ప్రచారం చేయనున్నారు.

అన్నాడిఎంకె
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని ఎఐఎడిఎంకె ప్రచారకుల జాబితాను ప్రకటించింది. ఎన్నికల్లో ప్రచారం చేయనున్న 19 మందితో కూడిన స్టార్ ప్రచారకుల జాబితాలో వెన్నిరాడై నిర్మలతో పాటు నటులు, దర్శకులు, కమెడియన్లు, విలన్లు ఉన్నారు.

వెన్నిరాడై నిర్మల
జయలలిత, వెన్నిరాడై నిర్మల ఇద్దరూ కూడా దాదాపు ఒకే సమయంలో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో 11వ తేదీ నుంచి ఆమె ప్రచారం చేస్తారని అన్నాడిఎంకె పార్టీ ప్రకటించింది.

ఒంటరిగా అన్నాడిఎంకె
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలను ఎదుర్కోవడానికి 11 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడిన పదిహేను రోజులకే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్టీ అన్నాడిఎంకె ఆ కూటమి నుంచి బైటికి వచ్చేశారు.

జయలలిత
తమిళనాడులో సీట్ల పంపిణీకి సంబంధించి ఆరు సీట్లకోసం వామపక్షాలు చేసిన డిమాండ్‌ను జయలలిత అంగీకరించకపోవడంతో ఈ కూటమి ముక్కలయింది. ఇప్పుడు జయలలిత పార్టీ రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు పోటీ చేయనుండగా, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి.

Click it and Unblock the Notifications