వెంటిలేటర్‌పై మాజీ ముఖ్యమంత్రి: 11 డాక్టర్లతో అత్యవసర చికిత్స
కోల్‌కత: సీపీఎం కురువృద్ధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్య పరిస్థిితి విషమించింది. వెంటిలేటర్‌పై ఆయనకు డాక్టర్లు అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. కోల్‌కతలోని వుడ్‌ల్యాండ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స తీసుకుంటోన్నారు.
79 సంవత్సరాల వయస్సున్న బుద్ధదేవ్ భట్టాచార్య.. శ్వాసకోస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం సాయంత్రం ఆయన వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచీ ఐసీయూలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు.

డాక్టర్లు అత్యాధునిక చికిత్సను అందిస్తోన్నప్పటికీ.. ఆరోగ్య పరిస్థితి కుదుటపడట్లేదు. ఈ సాయంత్రం మరింత విషమించింది. దీనితో వెంటిలేటర్‌పై ఉంచారు డాక్టర్లు. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, టైప్ 2 శ్వాసకోస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. కొద్దిసేపటి కిందటే హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.
డాక్టర్ కౌశిక్ చక్రవర్తి (మెడిసిన్), డాక్టర్ సౌతిక పండా (క్రిటికల్ కేర్), డాక్టర్ సుస్మిత దేబ్‌నాథ్ (క్రిటికల్ కేర్), డాక్టర్ సరోజ్ మాండల్ (ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ), డాక్టర్ అంకణ్ బంద్యోపాధ్యాయ (ఇంటర్నల్ మెడిసిన్ అండ్ పల్మనాలజీ), డాక్టర్ ధృవ భట్టాచార్య (ఇంటర్నల్ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్) ఆయనకు చికిత్స అందిస్తోన్నారు.
డాక్టర్ ఆసిస్ పాత్రా (అనస్థియాలజీ), డాక్టర్ దీప్ నారాయణ్ ముఖర్జీ (ఇన్‌ఫెక్టియస్ డిసీజ్ స్పెషలిస్ట్), డాక్టర్ సేమంతి చక్రవర్తి (ఎండోక్రానాలజీ), డాక్టర్ సోమ్‌నాథ్ మెయితీ (జనరల్ మెడిసిన్), డాక్టర్ సప్తర్షి బసు (ఫిజీషియన్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్) పర్యవేక్షణలో చికిత్స అందుతోంది.












Click it and Unblock the Notifications