సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత: తీరని లోటంటూ మోడీ

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్(Bindeshwar Pathak) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం బిందేశ్వర్ పాఠక్(80) తుదిశ్వాస విడిచారు. సులభ్ శానిటేషన్ అండ్ సోషల్ రిఫార్మ్ మూవ్‌మెంట్ ఆయన ప్రారంభించారు.

బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా పోరాడిన పాఠక్.. కమ్యూనిటి పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. 1943లో బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్‌లో బిందేశ్వర్ పాఠక్ జన్మించారు. సఫాయీ కర్మచారి కుటుంబాలతో కలిసి ఉండి, వారి కష్టాలను తెలుసుకున్నారు. 1970లో సులభ్ ఇంటర్నేషనల్‌ను స్థాపించారు.

Bindeshwar Pathak

సాంకేతిక ఆవిష్కరణ, మానవతా సూత్రాల సమ్మిళితంగా పనిచేయడమే దాని ఉద్దేశం. ఈ సంస్థ మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ వంటివాటిని ప్రోత్సహిస్తుంది. ఈ సులభ్ ఇంటర్నేషనల్ కింద ఇళ్ల్లో 13 లక్షల టాయిలెట్లు, 5.4 కోట్ల ప్రభుత్వ టాయిలెట్లు నిర్మించడం గమనార్హం. ఇందుకోసం అత్యంత చవకైన టుపిట్ సాంకేతికతను ఉపయోగించారు. మానవ వ్యర్థాలను మాన్యువల్‌గా శుభ్రపరచడాన్ని ఈ సంస్థ వ్యతిరేకించింది. దీనిని రద్దు చేసేందుకు ఉద్యమాన్ని నడిపింది.

ఈ క్రమంలో ఏళ్ల తరబడి సమాజంలో నాటుకుపోయిన ఈ విధానాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకువచ్చింది. ఎలాంటి రక్షణ తొడుగులు లేకుండా వ్యర్థాలను తమ చేతులతో తొలగించే విధానాన్ని పాఠక్ తీవ్రంగా ఖండించారు. ఇది కింపరిచే చర్య అని అన్నారు. సఫాయీ కర్మచారీ జీవితాల్లో ఆయన తీసుకువచ్చిన మార్పునకు, పర్యావరణ పరిశుభ్రత, సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం వంటి విషయాల్లో ఆయన చేసిన కృషికి గానూ ఎన్నో అవార్డులు కూడా పాఠక్‌ను వరించాయి.

1991లో కేంద్ర ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురష్కారమైన పద్మ భూషణ్‌తో సత్కరించింది. పాఠక్ భారత రైల్వేకు చెందిన స్వచ్ఛ రైల్ మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున భాగల్‌పూర్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించారు. పలు పుస్తకాలు కూడా ఆయన రచించారు.

బిందేశ్వర్ పాఠక్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. సమాజం, అణగారిన వర్గాల పురోగతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారు. ఆయన స్వచ్ఛభారత్ మిషన్‌కు అనిర్వచనీయమైన సహకారం అందించారని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+