క్లాస్‌మేటైన లవర్‌తో కలిసి భర్త హత్యకు ప్లాన్, పెళ్లయ్యాక కూడా..

చెన్నై: భర్త పైన హత్యాయత్నం చేశారని ఓ మహిళ సహా నలుగురు నిందితులను సింగనల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన శనివారం జరిగింది. కిరాయి గూండాలతో తన భర్తను హత్య చేయించాలని ఆమె పన్నాగం పన్నింది.

అన్నానగర్‌కు చెందిన భర్త తంగరాజ్(30) పైన ఇద్దరు సాయుధులైన దుండగులు శనివారం రాత్రి దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు చెప్పిన ప్రకారం.. రమ్య (19), తంగరాజ్‌లకు రెండేళ్ల క్రితం పెళ్లైంది.

రమ్య తన క్లాస్‌మెట్‌తో ప్రేమలో ఉన్నదని పోలీసుల విచారణలో తేలింది. డిప్లోమా చేస్తున్న సమయంలో రమ్య, ఆమె క్లాస్‌మెట్ ప్రేమించుకున్నారు.

ఆమెకు తల్లిదండ్రులు లేరని, దీంతో ఆమె ఆలనాపాలనా గ్రాండ్ పేరెంట్స్ చూస్తున్నారని పోలీసులు చెప్పారు. వారి ఇద్దరి మధ్యన ఉన్న లవ్ అఫైర్ తెలియడంతో గ్రాండ్ పేరెంట్స్ రమ్య చదువుమానిపించి, తంగరాజ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు.

Four including woman held for attempt to kill husband

పెళ్లి తర్వాత కూడా రమ్య తన లవర్‌తో సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ విషయమై తంగరాజ్, రమ్యల మధ్య తరుచూ గొడవ జరిగేది. తనకు విడాకులు ఇవ్వాలని భర్తను డిమాండ్ చేసేది. ఈ నేపథ్యంలో తన లవర్‌తో కలిసి రమ్య తంగరాజ్‌ను చంపాలని ప్లాన్ వేసుకున్నారు.

ఓ వ్యక్తితో రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తంగరాజ్‌ను హత్య చేసేందుకు అతనికి రమ్య, ఆమె ప్రియుడు రూ.1.6 లక్షల డబ్బు, బంగారం ఇచ్చారు. శనివారం నాడు రమ్య తన భర్తను బయటి నుండి ఫుడ్ తీసుకు రమ్మని చెప్పింది. ఆ తర్వాత ఈ సమాచారాన్ని తన లవర్‌కి ఇచ్చింది. దీంతో వారు దాడికి పాల్పడ్డారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+