బాలిక శీలానికి వెలకట్టిన పంచాయతీ పెద్దలు: రూ.లక్ష పరిహారం, ఎక్కడ అంటే..?
ఎంతటి కఠిన చట్టాలు వచ్చిన కొందరు మారడం లేదు. అదే.. మైనర్లపై రేప్ చేస్తున్నారు. నిత్యం దేశంలో ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తీవ్రంగా ఉన్న ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. కానీ మిగతా వాటి సంగతి ఏంటీ.. తూతూ మంత్రంగా యాక్షన్ ఉంటున్నాయి. ఛత్తీస్ ఘడ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మైనర్‌పై నలుగురు లైంగికదాడి చేశారు.

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్..
పదహారేళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు లైంగికదాడి చేశారు. జష్పూర్ జిల్లాలో ఈ నెల 9వ తేదీన ఘటన జరిగింది. బాలిక తన తండ్రితో కలిసి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని, బాలికను ఎత్తుకెళ్లారు. దగ్గరలోగల అటవీప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నలుగురు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత అడవిలో వదిలేసి వెళ్లిపోయారు.

సర్పంచ్‌తోపాటు పెద్దలు
ఊరి పెద్దలు పంచాయితీ నిర్వహించారు. సర్పంచ్‌తోపాటు పలువురు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. బాలికకు నష్టపరిహారం కింద నిందితులు రూ.లక్ష ఇచ్చేందుకు తీర్మానం చేశారు. ఈ కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించారు. వ్యవహారం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితులను అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.

శీలానికి వెల
మైనర్ బాలిక శీలానికి పంచాయతీ పెద్దలు వెలకట్టారు. రూ. లక్ష ఇచ్చి కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఎలాగోలా బయటకు వచ్చింది. లేదంటే అలా కప్పిపుచ్చే వారు.. ఓ చిన్నారి శీలానికి రూ.లక్ష ఇచ్చి సైలంట్ చేసే వారు. సదరు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు. ఈ కాలంలో కూడా పంచాయతీ పెట్టీ.. మరీ తీర్మానించడం ఏంటీ అని అడుగుతున్నారు. భూమి, ఇంటికి సంబంధించి పంచాయతీ చేసుకోవచ్చు.. మరీ శీలానికి వెల ఏంటీ అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ పెద్దలపై కూడా చర్యలు తీసుకుంటే.. మరొకరు అలా తీర్మానం చేసే ధైర్యం చేయరనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.












Click it and Unblock the Notifications