ఐపిఎస్ భార్య వేధింపులు, ప్రియురాలి కోసం పోలీసుగా..

వేధించడం ప్రారంభించారు. వారి వెకిలి వేషాలు భరించలేని ఆమె, పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి తన వివరాలు చెప్పారు. ఆకతాయిల ఆగడాలపై ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారి భార్య ఫిర్యాదు చేయడంతో ఆగమేఘాల మీద స్పందించిన పోలీసులు సిసిటివి పుటేజ్ చూసి అకిల్ అహ్మద్, ఇర్షాద్ ఆహ్మద్, గులాం అలీ, పర్వేజ్ ఆలమ్ లను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమ కోసం పోలీసుగా...
ప్రియురాలి కోసం ఓ యువకుడు పోలీసుగా అవతారమెత్తి కటకటాల్లోకి వెళ్లాడు. సినిమాటిక్ గా జరిగిన ఈ ఘటన హైదరాబాదు సంజీవరెడ్డి నగర్ పిఎస్ పరిధిలో జరిగింది. శ్రీకాంత్ ఎంబీఏ చదివి ఉద్యోగం చేస్తున్నాడు. తాను ఇష్టపడిన అమ్మాయికి ఆ ఉద్యోగం నచ్చలేదు. దాంతో పోలీస్ వేషంలో వెళితే ఆమె ఇంప్రెస్ అవుతుందనుకున్నాడు.
పోలీసు వేషధారణలో బుల్లెట్‌పై ప్రియురాలి దగ్గరకు వెళ్లాడు. పోలీసునంటూ ఆమెకు చెప్పాడు. ఈ నకిలీ పోలీసును చూసిన అసలు పోలీసులు మాత్రం అనుమానంగా చూశారు. అతనిని పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారణ జరిపారు. దాంతో అసలు విషయం బయటపడింది.












Click it and Unblock the Notifications