4 పోలీసుస్టేషన్లు సీజ్, కరోనా వైరస్ సోకడంతో తీరప్రాంత పీఎస్ క్లోజ్.. ఎక్కడంటే..?
కరోనా వైరస్ చైన్ తెంపేందుకు పోలీసులు ఆలుపెరగకుండా శ్రమిస్తున్నారు. కానీ కొందరు పోలీసులకు కూడా వైరస్ సోకుతోంది. వీరిలో కొందరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాలు ఉడుపి, దక్షిణ కన్నడకు చెందిన నాలుగు పోలీసు స్టేషన్లను అధికారులు మూసివేశారు. ఇక్కడ కరోనా వైరస్ కేసులు నమోదవడంతో పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఉడుపి జిల్లాలోని ఆజేకర్, కర్కలా రూరల్, బ్రహ్మవర్ పోలీసు స్టేషన్లలో ఒక్కో పోలీసుకు కరోనా వైరస్ సోకింది. ఆరోగ్య కార్యకర్తల సాయం తీసుకొని.. పోలీసు స్టేషన్లను శానిటైజ్ చేశామని ఎస్పీ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. తాత్కాలికంగా ఆ పోలీసుస్టేషన్లను మూసివేశామని తెలిపారు. ఆ పోలీసు స్టేషన్లను బుధవారం తెరుస్తామని వెల్లడించారు. అప్పటివరకు కర్కాళ సర్కిల్ వద్ద కొంతమంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

అంతేకాదు కర్కాళ పోలీసుస్టేషన్‌లో వైరస్ సోకిన వారు నివసిస్తోన్న బీ, సీ బ్లాక్ పోలీసు క్వార్టర్లను కూడా సీజ్ చేశారు. ఆ ప్రాంతాన్ని కంటోన్మైంట్ జోన్‌గా ప్రకటించారు. ఆ పోలీసుస్టేషన్ పరిధిలో పనిచేస్తున్న 100 మందిని ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఆ పోలీసులతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను కనుక్కొని.. వారికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.
దక్షిణ కన్నడ జిల్లాలో గల విట్టల్ పోలీసుస్టేషన్‌లో ఒకరికి కోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడ కూడా పీఎస్.. క్లోజ్ చేసి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బెంగళూరులో కూడా కానిస్టేబుల్‌కు కరోనా వరస్ సోకింది. ఛామరాజ్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించే సమయంలో వైరస్ సోకింది.
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications