Bomb Threats: 4 ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Bomb Threats: ఇటీవల కార్యాలయాలు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా నోయిడాలోని 4 ప్రైవేట్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలల ప్రాంగణంలో ఏపీ కనిపించనప్పటికీ ముందు జాగ్రత్తగా విద్యార్థులను భవనాల నుంచి తరలించారు. నోయిడా పోలీసులు, అగ్నిమాపక దళం, బాంబు స్క్వాడ్ బృందాలు స్టెప్ బై స్టెప్ స్కూల్, ది హెరిటేజ్ స్కూల్, జ్ఞానశ్రీ స్కూల్, మయూర్ స్కూల్ వద్దకు చేరుకుని పాఠశాలల ప్రాంగణాల్లో సెర్చ్ ఆపరేషన్స్ ను ప్రారంభించాయి.
ఆయా పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయగా..ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని పాఠశాలలు తిరిగి తరగతులను కూడా ప్రారంభించాయి. ఈ క్రమంలోనే సైబర్ బృందాలు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపుల గురించి సమాచారం అందించిన వ్యక్తి గురించి దర్యాప్తు ప్రారంభించాయి. ఈ-మెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, భయపడవద్దని పోలీసులు కోరారు. మయూర్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉదయమే విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టారు. తాము అందరు విద్యార్థులను జాగ్రత్తగా తరలించడం ప్రారంభించినట్లు.. ప్రస్తుతం విద్యార్థులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని సమాచారం అందించారు.
విద్యార్థులను స్కూల్ బస్సుల ద్వారా ఇంటికి పంపిస్తున్నామని చెప్పారు. అవసరమయ్యే అన్ని ప్రోటోకాల్స్ పూర్తయిన తర్వాత అప్డేట్ అందిస్తామని మయూర్ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఇటీవల కాలంలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు, మెయిల్స్ వస్తుండడంతో అధికారులు పటిష్ట నిఘా పెట్టారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications