బీరు తాగి కాలేజీకొచ్చిన అమ్మాయిలకు టీసీలు

చెన్నై: పట్టపగలు బీరు తాగి క్లాస్ కు వచ్చి ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుంటే ఊగిపోయిన నలుగురు అమ్మాయిలకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపించారు. ఇది జరిగింది ఏదో కార్పొరేట్ విద్యాసంస్థలో కాదు, ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.

తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్ పట్టణంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇదే పాఠశాలలో ప్లస్ టూ (ఇంటర్) చదవడానికి అవకాశం ఉంది. ఈ స్కూల్ లో 11వ తరగతి (ఇంటర్ మొదటి సంవత్సరం) చదువుతున్న ఓ అమ్మాయి పుట్టిన రోజు ఇటీవల జరిగింది.

అదే క్లాస్ లో చదువుతున్న 7గురు అమ్మాయిలు స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలు స్కూల్ లో నిర్వహించాలని ప్లాన్ వేశారు. తరువాత కూల్ డ్రింక్ సీసాలలో బీరు కలుపుకుని అనుమానం రాకుండా స్కూల్ లోకి తీసుకు వెళ్లారు.

పుట్టిన రోజు వేడుకలు అయిన తరువాత మధ్యాహ్నం బోజనం సమయంలో బీరు తాగాలని ముందుగా ప్లాన్ వేశారు. అయితే ముగ్గురు అమ్మాయిలు భయంతో బీరు తాగలేదు. నలుగురు అమ్మాయిలు మాత్రం బీరు తాగేశారు.

Four school girls dismissed for drinking beer in classromm in Tamil Nadu

తరువాత నేరుగా వెళ్లి క్లాస్ రూంలో కుర్చున్నారు. పాఠాలు చెబుతున్న టీచర్లు అమ్మాయిలు మద్యం మత్తులో ఊగుతున్న విషయం గుర్తించి ప్రిన్సిపల్ కు సమాచారం ఇచ్చారు. ప్రిన్సిపల్ నలుగురుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నలుగురు అమ్మాయిలో మద్యం సేవించారని వెలుగు చూసింది. అంతే విషయం పై అధికారులకు తెలిసింది. అమ్మాయిల కుటుంబ సభ్యులను పిలిపించి వెంటనే టీసీలు ఇవ్వాలని విద్యాశాఖ అధికారి గోపిదాస్ ఆదేశాలు జారీ చేశారు.

స్కూల్ ప్రిన్సిపల్ అమ్మాయిల కుటుంబ సభ్యులను పిలిపించి విద్యార్థినిలకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరగడంతో విద్యాశాఖ అధికారులు సైతం షాక్ కు గురైనారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+