Operation Trinetra II: జమ్మూలో ఆపరేషన్ త్రినేత్ర II.. నలుగురు ఉగ్రవాదులు హతం..

జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ త్రినేత్ర 2 విజయవంతంగా కొనసాగుతోంది. పూంచ్ జిల్లాలో ఆపరేషన్ త్రినేత్ర II' కింద మంగళవారం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం రాత్రి సూరంకోట్ బెల్ట్‌లోని సింధారా టాప్ ఏరియాలో ఆర్మీ, పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్ పోలీసు ఉన్నతాధికారిని ఉటంకిస్తూ మంగళవారం ఉదయం 5 గంటలకు కాల్పులు జరిగాయని. ఇందులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని నివేదిక పేర్కొంది.

"ఆపరేషన్ త్రినేత్ర II. ఒక ప్రధాన కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌లో, నిర్దిష్ట ఇంటెలిజెన్స్‌తో, సిందారా, మైదానా సమీపంలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు" వైట్ నైట్ కార్ప్స్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. హతమైమన ఉగ్రవాదాలు భారీ దాడులు చేయడం కోసం వచ్చినట్లు తెలిసింది. మరణించిన ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు చెందిన వారికి గుర్తించారు. వారి వద్ద నాలుగు ఏకే-47 రైఫిళ్లు, రెండు పిస్టల్స్‌, ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా అధికారి చెప్పారు.

operationtrinetraii

సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు 'ఆపరేషన్ త్రినేత్ర II' ప్రారంభించారు. ఈ ఆపరేషన్ కింద సరిహద్దు జిల్లా పూంచ్‌లో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించేందుకు ఆర్మీ, పోలీసులు సంయుక్త శోధన, కార్డన్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్ మంగళవారం రెండో రోజుకు చేరింది. 'ఆపరేషన్ త్రినేత్ర II' సోమవారం మధ్యాహ్నం సూరంకోట్ తహసీల్‌లోని సిందారా, మైదానంలో ప్రారంభించారు. జులై 16, 17 మధ్య రాత్రి పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.

పూంఛ్‌లో ఏప్రిల్‌లో భింబర్‌ గలీ నుంచి సాంగియోట్‌కు ఇఫ్తార్‌ విందు కోసం పండ్లను తీసుకెళుతున్న సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడి విషయం తేలిసిందే.ఈ దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. జైషే, లష్కరే సంస్థల క్షేత్రస్థాయి ఉగ్రవాదులు కలిసి దాడి చేసి ఉంటారని భద్రత అధికారులు ఆభావిస్తున్నారు. ఉగ్రవాదుల సాయుధ కవచాన్ని చీల్చగలిగే సామర్థ్యమున్న ఉక్కు బుల్లెట్‌లను వినియోగించినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+