Fox: నక్క ముఖం చూసినా, నక్కతోక తొక్కినా జాక్ పాట్, నక్క దెబ్బ ?, పక్కనోడు బాగుపడితే ?
బెంగళూరు/తుమకూరు: అందమైన అమ్మాయి ఎవరైనా ఓ అబ్బాయిని ప్రేమించిందంటే అబ్బా వీడు నక్కతోక తొక్కాడు రా అంటారు. ఇక వ్యాపారంలో, రాజకీయాలతో పాటు ఏదైనా రంగంలో జాక్ పాట్ కొట్టి దూసుకుపోతుంటే వారిని అబ్బా వీడు రోజు నక్కముఖం చూస్తున్నాడురా అనే సామెతలు చెబుతుంటారు. ఇక హాలీవుడ్ లో కొన్ని దశాభ్దాల క్రితమే ఫాక్స్ ఫిక్చర్స్ అనే పేరుతో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించి విడుదల చేశారు. మనకు ఏదైనా చెడు జరిగితే నిద్రలేచి ఎవరిముఖం చూశామో ఏమో ఈరోజు ఇలా జరిగింది అనుకుంటాము. అలాంటిది ప్రతిరోజు నక్క ముఖం చూడాలని ఓ వ్యాపారి అనుకున్నాడు. అనుకున్నట్లే ప్రతిరోజు నక్కముఖం చూస్తున్నాడు. అయితే నక్క ముఖం చూడకముందే ఆరోజు అతను అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

మంచి జరగాలని అనుకుంటారు
ప్రపంచంలో ఎవరైనా సరే ఈ రోజు మన అంతా మంచి జరగాలని అనుకుంటారు. నాకు చెడు జరగాలని దాదాపుగా ఎవ్వరూ కోరుకోరు. ఇక భారతదేశం సాంప్రధాయాలు, నమ్మకాల ప్రకారం నక్క ముఖం చూస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. పెద్దలు కూడా సామెతలు చెబుతూనే ఉంటారు. ఎవరైనా పచ్చగా కనపడితే చాలు అబ్బా వీడు నక్కముఖం చూశాడురా అనో, లేదంటే వీడు నక్కతోక తొక్కాడురా అని అందరూ అంటుంటారు.

వ్యాపారి ఏం చేశాడంటే ?
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని హబ్బూరు సమీపంలోని నాగవల్లి గ్రామంలో లక్ష్మీకాంత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లక్ష్మీకాంత్ వ్యవసాయం చేయిస్తూ సొంత భూమిలో కోళ్ల ఫామ్ లు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. లక్ష్మీకాంత్ కు చాలా కోళ్లఫామ్ లు ఉన్నాయి. నక్క ముఖం చూస్తే మనకు మంచి జరుగుతుందని సామెతను నమ్మిన లక్ష్మీకాంత్ ఓ నక్కను పట్టుకుని వచ్చి దానిని కోళ్లఫామ్ లో సీక్రేట్ గా పెంచుకుంటున్నాడు.

కోళ్లఫామ్ లో నక్క కోసం ప్రత్యేకంగా ఓ రూమ్
ప్రత్యేకంగా తయారు చేయించిన ఇనుప బోన్ లో నక్కను కట్టేసిన లక్ష్మీకాంత్ అతని కోళ్లఫామ్ లోని ఓ రూమ్ లో పెట్టాడు. నక్క మెడలో ఎర్రటి బెట్ట్ కట్టాడు. లక్ష్మీకాంత్ కోళ్ల ఫామ్ లో నక్క ఉందని అక్కడ పని చేస్తున్న వాళ్లకు మాత్రమే తెలుసు. నక్క ముఖం చూస్తే మంచి జరుగుతుందని అనుకున్న లక్ష్మీకాంత్ ప్రతిరోజు అతని కోళ్ల ఫామ్ లో ఉన్న నక్కను చూస్తున్నాడు. ఇక పని మీద బయటకు వెళ్లాలంటే కచ్చితంగా నక్క ముఖం చూస్తున్న లక్ష్మీకాంత్ బయటకు వెళ్లి అతని పనులు చేసుకుంటున్నాడు.

మ్యాటర్ లీక్ అయ్యింది
లక్ష్మీకాంత్ బాగుపడిపోతున్నాడనో, లేక అతను శ్రీమంతుడు అయిపోతున్నాడనో తెలీదు కాని కొంత మంది అతని మీద కసి పెంచుకున్నాడు. లక్ష్మీకాంత్ కోళ్లఫామ్ లో ఉన్న నక్కను మాయం చేస్తే అతని వ్యాపారాలు దెబ్బ తింటాయని అనుకున్న కొందరు గుర్తు తెలియన వ్యక్తులు అటవి శాఖ సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవి శాఖ సీఐడీ అధికారులు కోళ్లఫామ్ దగ్గరకు వెళ్లి అక్కడ నక్క ఉన్న విషయం నిర్దారించుకున్నారు.

నక్క పని అయిపోయింది
కొంతకాలం క్రితం కొన్ని నక్క పిల్లలు చెరువు దగ్గర కనపడ్డాయని, ఒక్క నక్క పిల్లను మాత్రం తాను తెచ్చుకుని పెంచుకుంటున్నానని లక్ష్మీకాంత్ అటవి శాఖ అధికారులకు చెప్పాడు. అయితే అక్రమంగా నక్కను బోన్ లో బంధించి పెంచుతున్నాడని ఆరోపిస్తూ లక్ష్మీకాంత్ ను అటవి శాఖ సీఐడి అధికారులు అతన్ని అరెస్టు చేశారు. కోళ్లఫామ్ లో ఉన్న నక్కను అటవి శాఖ అధికారులు పట్టుకుపోయారు.

పక్కనోళ్లు బాగుపడితే చూడలేరు
లక్ష్మీకాంత్ అరెస్టు కావడంతో అతని ప్రత్యర్థులు హమ్మయ్యా, ఇక వీడి పని అయిపోయింది అనుకుంటున్నారు. మొత్తం మీద నక్కను పెంచుకుంటున్న లక్ష్మీకాంత్ ఆరోజు నక్క ముఖం చూడకుండానే అరెస్టు కావడంతో ఆసామెత నిజం అని స్థానికులు గుసగుసలాడుతున్నారు. నక్కను పెంచాడనే పాపానికి లక్ష్మీకాంత్ అరెస్టు అయ్యాడనే వార్త ఆ ప్రాతంలో వైరల్ అయ్యింది.












Click it and Unblock the Notifications