బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Fraud: కరోనా ఎఫెక్ట్, ఒకప్పుడు బాగానే బతికాడు, ఇప్పుడు నకిలీ కోవిడ్ పరీక్షల సర్టిఫికెట్లు, నకిలీ వీసాలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ, లాక్ డౌన్ కారణంగా ఎవరి జీవితాలు ఎలా తల్లకిందులు అయ్యాయో చెప్పాలంటే కొన్ని లక్షల పేజీల పుస్తకాలు సరిపోవు. పొట్టకూటి కోసం తప్పు చెయ్యని వారు కూడా ఈ కరోనా మహమ్మారి దెబ్బతో తప్పులు చేసి అడ్డంగా బుక్కైపోయిన సంఘటనలు మనం చూస్తున్నాము. కాలేజ్ లో విద్యార్థులకు సీట్లు ఇప్పించే మీడియేటర్ పని చేస్తున్న ఓ వ్యక్తి కరోనా మహమ్మారి దెబ్బతో విద్యాసంస్థలు మూతపడటంతో అడ్డదారిలో నడిచాడు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో అనేక మంది సరైన సమయంలో కోవిడ్ పరీక్షల ఫలితాల సర్టిఫికెట్లు అందకపోవడంతో మద్యవర్థులను సంప్రధిస్తున్నారు. ఇదే మంచి చాన్స్ అనుకున్న ఓ వ్యక్తి నకిలి కోవిడ్ సర్టిఫికెట్లతో తయారు చేసి ఆన్ లైన్ లో విక్రయించేశాడు. పనిలో పనిగా వేల రూపాయల నుంచి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు విక్రయించిన వ్యక్తి అడ్డంగా బుక్కైపోయాడు.

Wife: భర్తకు క్వాటర్ మందు, బలిసిన నాటుకోడి ఫిగర్ తో ఎంజాయ్, భార్యకు పస్తులు, చంపేసి ఎస్కేప్ !Wife: భర్తకు క్వాటర్ మందు, బలిసిన నాటుకోడి ఫిగర్ తో ఎంజాయ్, భార్యకు పస్తులు, చంపేసి ఎస్కేప్ !

 కేరళ టూ బెంగళూరు

కేరళ టూ బెంగళూరు

కేరళకు చెందిన నిపుణ్ అనే వ్యక్తి ఇంటర్ వరకు చదివాడు. పొట్టకూటి కోసం కేరళ నుంచి బెంగళూరు వచ్చిన నిపుణ్ మొదట చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగించాడు. తరువాత బెంగళూరులోని పలు విద్యాసంస్థల్లో కేరళకు చెందిన విద్యార్థులకు సీట్లు ఇప్పించే పని మొదలు పెట్టాడు. కాలేజ్ లో విద్యార్థులకు సీట్లు ఇప్పించే మీడియేటర్ పని చేస్తున్న నిపుణ్ కరోనా మహమ్మారి దెబ్బతో విద్యాసంస్థలు మూతపడటంతో అడ్డదారిలో నడిచాడు.

ఆన్ లైన్ లో డీలింగ్

ఆన్ లైన్ లో డీలింగ్

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో అనేక మంది సరైన సమయంలో కోవిడ్ పరీక్షల ఫలితాల సర్టిఫికెట్లు అందకపోవడంతో మద్యవర్థులను సంప్రధిస్తున్నారు. ఇదే మంచి చాన్స్ అనుకున్న నిపుణ్ నకిలి కోవిడ్ సర్టిఫికెట్లతో తయారు చేసి ఆన్ లైన్ లో విక్రయించేశాడు. కోవిడ్ సర్టిఫికెట్లు అవసరం ఉన్న వారిని నిపుణ్ సోషల్ మీడియాలో సంప్రధించాడు. అలా కొంతకాలంగా నిపుణ్ అతని పని చాపకింద నీరులా చేస్తూ వచ్చాడు.

 వాట్సాప్, ఫేస్ బుక్ లో డీలింగ్

వాట్సాప్, ఫేస్ బుక్ లో డీలింగ్

కేరళకు చెందిన నిపుణ్ నకిలి కోవిడ్ సర్టిఫికెట్ ను రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నాడు. నేరుగా నకిలి కోవిడ్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా అవసరం ఉన్న వారికి పంపిస్తున్న నిపుణ్ తరువాత ఆన్ లైన్ లో అందుకు ప్రతిఫలంగా వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నాడని పోలీసులకు సమాచారం అందింది.

Recommended Video

CP Sajjanar Press Meet on SIM Swap Fraud | Oneindia Telugu
 లక్ష రూపాయలకు నకిలీ వీసా

లక్ష రూపాయలకు నకిలీ వీసా

నకిలి కోవిడ్ సర్టిఫికెట్లతో పాటు నకిలీ వీసాలు విక్రయించడం మొదలు పెట్టిన నిపుణ్ పోలీసుల కంట్లో పడ్డాడు. నకిలీ వీసా ను రూ. 25, 000 నుంచి లక్ష రూపాయాల వరకు విక్రయిస్తున్న నిపుణ్ వ్యవహారం బెంగళూరులోని హుళిమావు పోలీసులకు తెలిసింది. పక్కాప్లాన్ వేసిన పోలీసులు నకిలి కోవిడ్ సర్టిఫికెట్లతో పాటు నకిలి వీసాలు విక్రయిస్తున్న నిపుణ్ ను అరెస్టు చేశారు. నిపుణ్ నుంచి ల్యాప్ టాప్ తో పాటు ప్రింటర్, నకిలి సర్టిఫికెట్లు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తున్న పత్రాలు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరులోని హుళిమావు పోలీసులు తెలిపారు.

English summary
Fraud: Covid test fake report and fake Visa card generator man arrested by Bengaluru Hulimavu police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X