Lady techie: ఆన్ లైన్ లో వైన్ బాటిల్ ఆర్డర్, మేడమ్ కు ఫుల్ బాటిల్ కిక్కు ఎక్కేసింది, అసలు మ్యాటర్ !

బెంగళూరు:ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో యువతి టెక్కీగా ఉద్యోగం చేస్తూ భారీ మొత్తంలో జీతం తీసుకుంటున్నది. ఇయర్ ఎండ్ కావడంతో వరుసగా కంపెనీకి సెలవులు రావడంతో ఇంటిలో వైన్ తాగుతూ ఎంజాయ్ చెయ్యాలని లేడీ టెక్కీ అనుకుంది. ఆన్ లైన్ లో మంచి బ్రాండ్ వైన్ బాటిల్ కొనుగోలు చెయ్యాలని ప్రయత్నించింది. మంచి కిక్కు ఇచ్చే వైన్ బాటిల్ ఆర్డర్ చేసింది. అయితే ఆర్డర్ బుక్ కాకపోవడంతో అందులోని కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేసింది. ఫోన్ లో మాట్లాడిన అవతలి వ్యక్తి లేడీ టెక్కీకి మస్కాకొట్టాడు. రూ. 900 విలువైన వైన్ బాటిల్ బుక్ చెయ్యడానికి ప్రయత్నించిన లేడీ టెక్కీ అకౌంట్ నుంచి రూ. 1 లక్ష మాయం అయ్యింది. వైన్ కథ దేవుడు ఎరుగు ఫుల్ బాటిల్ తాగిన కిక్కు ఒకేసారి రావడంతో లేడీ టెక్కీ పోలీస్ స్టేషన్ కు పరిగెత్తింది.

పూణేలో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ

పూణేలో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ యువతి ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చెయ్యడంతో పూణేలోని కల్యాణినగర్ ఏరియాలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. పూణే చేరుకున్న ఆ యువతి సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తూ భారీ మొత్తంలో జీతం తీసుకుంటున్నది. ఫ్రెండ్ తో కలిసి ఆమె ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నది.

ఆన్ లైన్ లో వైన్ బాటిల్

ఆన్ లైన్ లో వైన్ బాటిల్

ఇయర్ ఎండ్, క్రిస్మస్ పండుగ రావడంతో వరుసగా సాఫ్ట్ వేర్ కంపెనీకి సెలవులు రావడంతో ఇంటిలో వైన్ తాగుతూ ఎంజాయ్ చెయ్యాలని లేడీ టెక్కీ అనుకుంది. ఆన్ లైన్ లో మంచి బ్రాండ్ వైన్ బాటిల్ కొనుగోలు చెయ్యాలని లేడీ టెక్కీ ప్రయత్నించింది. మంచి కిక్కు ఇచ్చే బ్రాండెడ్ వైన్ బాటిల్ ఆర్డర్ బుక్ చేసింది.

బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పండి

బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పండి

ఆన్ లైన్ ఎంతసేపటిని వైన్ బాటిల్ బుక్ కాలేదు. ఆర్డర్ బుక్ కాకపోవడంతో అందులోని కస్టమర్ కేర్ నెంబర్ కు లేడీ టెక్కీ ఫోన్ చేసింది. ఫోన్ లో మాట్లాడిన అవతలి వ్యక్తి లేడీ టెక్కీకి మస్కాకొట్టాడు. బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాలని అవతలి వ్యక్తి చెప్పాడు. బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వడానికి లేడీ టెక్కీ నిరాకరించింది.

క్యూర్ కోడ్ తో గోవిందా గోవింద

క్యూర్ కోడ్ తో గోవిందా గోవింద


కొంతసేపటి తరువాత మళ్లీ ఆవ్యక్తి లేడీ టెక్కీకి ఫోన్ చేసి డబ్బులు రాలేదని చెప్పాడు. తరువాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు ఇవ్వాలని అన్నాడు. లేడీ టెక్కీ ఆన్ లైన్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఆమె అకౌంట్ నుంచి 900 వందలకు బదులుగా లేడీ టెక్కీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 96,902 అవతలి వ్యక్తి అకౌంట్ కు వెళ్లిపోయింది. తరువాత అదే కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.

వైన్ బాటిల్ కథ దేవుడు ఎరుగు... ఇంత జరిగింది సార్

వైన్ బాటిల్ కథ దేవుడు ఎరుగు... ఇంత జరిగింది సార్

రూ. 900 విలువైన వైన్ బాటిల్ బుక్ చెయ్యడానికి ప్రయత్నించిన లేడీ టెక్కీ అకౌంట్ నుంచి రూ. సుమారు లక్ష రూపాయలు మాయం అయ్యింది. వైన్ బాటిల్ కథ దేవుడు ఎరుగు మీరే కాపాడండి అంటూ లేడీ టెక్కీ పూణేలోని యారవాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి చీటింగ్ కేసు పెట్టింది. పూణే సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్ లైన్ కంపెనీ గురించి వివరాలు తెలుసుని దర్యాప్తు చేస్తున్నారు. వైన్ బాటిల్ కోసం ఆన్ లైన్ లో చూసిన లేడీ టెక్కీకి రూ. 1 లక్ష మాయం కావడంతో దెబ్బకు ఒకేసారి ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్కు ఎక్కేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+