బుర్ద్వాన్ పేలుళ్లు: హైదరాబాద్‌లో టెర్రరిస్ట్ ఖలీద్ అరెస్ట్

ఖలీద్ నకిలీ గుర్తింపు కార్డులతో హైదరాబాదులో ఉంటున్నట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్ టెర్రర్ క్యాంప్ నుండి అతను హైదరాబాద్ వచ్చినట్లుగా గుర్తించారని తెలుస్తోంది. ఐఎస్ఐఎస్‌తో ఖలీద్‌కు సంబంధాలు ఉన్నాయి. బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ఉగ్రవాది కీలక నిందితుడు.
అతనిని హైదరాబాదులో అరెస్టు చేసిన పోలీసులు.. అతని నుండి ఐఈడీ బాంబుల తయారీ మెటీరియల్‌ను, పలు వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బుర్ద్వాన్ పేలుళ్ల తర్వాత అతను హైదరాబాద్ మకాం మార్చినట్లుగా తెలుస్తోంది. అతనికి బంగ్లా తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాంబులు తయారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బాంబులు పేలాయి.


Click it and Unblock the Notifications