జస్టిస్ పుష్ప... ఆ వివాదాస్పద తీర్పుల జడ్జి పదవీకాలం మరో ఏడాది పొడగింపు...
లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో ఇటీవల వివాదాస్పద తీర్పులు వెలువరించిన బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి పుష్ప గనెదివాలా పదవీకాలాన్ని కేంద్ర న్యాయశాఖ మరోసారి పొడగించింది. సాధారణంగా అదనపు న్యాయమూర్తి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. కానీ ఇటీవలి వివాదాస్పద తీర్పుల నేపథ్యంలో కేంద్రం ఆమె పదవి కాలాన్ని ఒక ఏడాది మాత్రమే పొడగించింది.
అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ పుష్ప శుక్రవారంతో తన రెండేళ్ల పదవీ కాలన్ని పూర్తి చేసుకున్నారు. నిజానికి అదనపు న్యాయమూర్తి పదవి తర్వాత శాశ్వత న్యాయమూర్తి హోదా రావాల్సి ఉంటుంది. పుష్ప గనెదివాలా అదనపు న్యాయమూర్తి పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో.. ఆమెకు శాశ్వత న్యాయమూర్తి హోదా కోసం గతంలోనే సుప్రీం కోర్టు కొలీజయంకు ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే వివాదాస్పద తీర్పుల కారణంగా గత నెల 20న ఆ ప్రతిపాదనలను సుప్రీం కోర్టు కొలిజీయం పక్కన పెట్టేసింది.

అదనపు న్యాయమూర్తి పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడగించాలని సుప్రీం కొలిజీయంను కోరడం బదులు... కేంద్ర న్యాయశాఖనే ఆమెకు మరో ఏడాది పాటు పదవి కాలాన్ని పొడగించడం గమనార్హం.
కాగా,గత నెలలో 12 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో న్యాయమూర్తి పుష్ప వివాదాస్పద తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. పోక్సో చట్టం ప్రకారం... బాలిక స్తనాలను దుస్తుల పైనుంచి తాకడాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని పేర్కొంది. ఈ చట్టం ప్రకారం ఇద్దరి మధ్య స్కిన్-టు-స్కిన్(చర్మాన్ని చర్మం తాకడం) కాంటాక్ట్ జరిగినప్పుడు మాత్రమే లైంగిక దాడిగా పరిగణిస్తామని స్పష్ట చేసింది. పోక్సో చట్టం కింద నిందితుడిపై నమోదైన అభియోగాలను కొట్టివేసి అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.
గత నెలలోనూ మరో వివాదాస్పద తీర్పును వెలువరించారు జస్టిస్ పుష్ప. మరో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో... బాలిక చేతిని పట్టుకుని,అతను ప్యాంట్ జిప్ తెరిచినంత మాత్రానా పోక్సో చట్టం కింద దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని పుష్ప పేర్కొన్నారు.ఐపీసీ సెక్షన్ 354-A(1) ప్రకారం అది లైంగిక వేధింపుల కిందకు వస్తుంది తప్ప.. పోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడి కిందకు రాదని స్పష్టం చేశారు. జస్టిస్ పుష్ప ఇచ్చిన ఈ రెండు తీర్పులు వివాదాస్పదంగా మారి తీవ్ర చర్చకు దారితీశాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications