Fridge Explode: ఫ్రిజ్ పేలి ఒకే ఇంట్లో నలుగురు మహిళలు సజీవదహనం.. ఈ చిన్న తప్పు మీరూ చేస్తున్నారా..?

ఫ్రిజ్ అనేది ఒకప్పుడు విలాస వస్తువు.. కానీ ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఫ్యామిలీస్ కాదు బ్యాచిలర్ రూమ్స్ లోనే ఇప్పుడు ఫ్రిజ్ సాధారణం అయిపోయింది. ప్రతి ఇంట్లో ఉండే ఫ్రిజ్ తో ఎంత సుఖం ఉందో.. అంత ప్రమాదం కూడా ఉందని గ్రహించాలి. కర్ణాటకలోని బెలగావి జిల్లాలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి విషాదకరమైన ఘటన జరిగింది. అప్పటి వరకూ గణేషుడి విగ్రహం వద్ద పాటలు, భజనలతో మునిగిపోయిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీరని విషాదం నెలకొంది. ఇంట్లోని ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు భారతి దామోన్(50), శారద దామోన్(45), గంగా దామోన్(25), ప్రియ దామోన్(24) గా గుర్తించారు. ఇక గాయపడిన మరో ఇద్దరిని గజనాన్ దామోన్(65), రోషన్ దామోన్(21) గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని ఛావత్ గల్లీలో దామోన్ కుటుంబం నివసిస్తోంది. అయితే సోమవారం వినాయకచవితి కావడంతో ఇంట్లో వినాయకుడిని పెట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక సోమవారం రాత్రి కూడా అలాగే భోజనం పూర్తయిన తర్వాత ఎప్పటిలాగే ఫ్రిజ్ పక్కన పడుకున్నారు. అయితే అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాలకు భారీ శబ్ధంతో ఏదో పేలినట్లు స్థానికులు గమనించారు. వెంటనే చుట్టుపక్కల వాళ్లు ఇంటి వద్దకు తరలివచ్చారు. అయితే అప్పటికే ఇళ్లు మొత్తం మంటలు వ్యాపించాయి. అతికష్టం మీద గజనాన్, రోషన్ ను బయటకు లాగారు. మిగిలిన నలుగురు మహిళలు సజీవదహనం అయ్యారు. ఇక గాయపడిన ఆ ఇద్దరికీ దాదాపు 60 శాతంకు పైగా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అలాగే పేలుడు ధాటికి వారి షెడ్ పూర్తిగా కూలిపోయింది. ఇంట్లోని వస్తువులు, సామాగ్రి మొత్తం కాలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి.

Fridge Explode Tragic incident Karnataka Belagavi district 4 women die after refrigerator explodes

ఫ్రిజ్ పేలడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే మరోదైనా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇలా జరిగిందా..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోని గణేష్ విగ్రహానికి లైట్స్ పెట్టి ఉన్నాయి. దాంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిందా.. అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇంటి యజమాని గజనాన్ కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. మిగతా మహిళలు పని మనుషులుగా చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+