Friends: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు, పక్కలో మంత్రి, అమావాస్య టైమ్ లో !
బెంగళూరు/ బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి చాలా కాలం తరువాత మళ్లీ ప్రజల మద్యకు వచ్చారు. కర్ణాటక రవాణా శాఖా మంత్రి, ప్రాణస్నేహితుడు బళ్లారి శ్రీరాములుతో కలిసి మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. చాలా సంవత్సరాల తరువాత బళ్లారిలో ఉండటానికి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. బళ్లారి ఇన్ చార్జ్ మంత్రిగా 16 ఏళ్ల తరువాత బళ్లారి శ్రీరాములుకు అవకాశం వచ్చింది. బళ్లారి బ్రదర్స్ కు అన్ని కలిసివస్తున్నాయని వాళ్ల అభిమానులు, అనుచరులు అంటున్నారు. ఇదే సమయంలో మంగళవారం అమావాస్య సందర్బంగా అంతుకు ముందు రోజు నుంచి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన ప్రాణస్నేహితుడు, కర్ణాటక రవాణా శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములతో కలిసి హంపీలో ప్రత్యేక పూజలు చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

గాలి జనార్దన్ రెడ్డికి అవకాశం
మైనింగ్ కేసులకు సంబంధించి జైలు జీవితం అనుభవించిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తరువాత షరులతో బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లాలో ఉండటానికి అవకాశం ఇవ్వడానికి అప్పట్లో సుప్రీం కోర్టు నిరాకరించింది. గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లాలో ఉండటానికి ఇటీవల సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

బళ్లారి శ్రీరాములకు లక్కీచాన్స్
బళ్లారి బ్రదర్స్ లో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకున్న బళ్లారి శ్రీరాములు ప్రస్తుతం కర్ణాటక రవాణా శాఖా మంత్రిగా పని చేస్తున్నారు. మంత్రిపదవి చిక్కినా బళ్లారి ఇన్ చార్జ్ మంత్రిగా బళ్లారి శ్రీరాములకు అవకాశం చిక్కలేదు. అయితే ఇటీవల 16 ఏళ్ల తరువాత మళ్లీ బళ్లారి శ్రీరాములుకు బళ్లారి ఇన్ చార్జ్ మంత్రి పదవి దక్కింది.

హంపీలో ప్రత్యేక పూజలు చేసిన ప్రాణ స్నేహితులు
గాలి జనార్దన్ రెడ్డికి ప్రాణ స్నేహితుడిగా మంత్రి బళ్లారి శ్రీరాములు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రాణస్నేహితుడు అయినా బళ్లారి జనార్దన్ రెడ్డి కుటుంబంలో ఒక్కడిగా, బళ్లారి బ్రదర్స్ లో ఒక్కడిగా బళ్లారి శ్రీరాములకు మంచి గుర్తింపు ఉంది. ఇదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి, మంత్రి బళ్లారి శ్రీరాములు హంపీలో ప్రత్యేక పూజలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

హంపీలోని ఫామ్ హౌస్ లో !
హంపీలోని ఓ ఫామ్ హౌస్ లోని ఆశ్రమంలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటక రవాణా శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు ప్రత్యేక పూజలు, హోమాలు చేశారని వారి అనుచరులు అంటున్నారు. ఈ ప్రత్యేక పూజల్లో గాలి జనార్దన్ రెడ్డి, మంత్రి బళ్లారి శ్రీరాములు ముఖ్య అనుచరులు పాల్గోన్నారు. అమావాస్య ముందు రోజు నుంచి గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు హంపీలో ప్రత్యేక పూజలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

చాలా కాలం తరువాత ?
ప్రత్యేక పూజలు, హోమాలు చేసిన తరువాత గాలి జనార్దన్ రెడ్డి, మంత్రి బళ్లారి శ్రీరాములు తుంగభద్రా నదిలో తెప్ప మీద విహరించారు. హంపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు ఉత్సాహం తిరుగుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. గజరాజు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి పూలమాల వేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బళ్లారి బ్రదర్స్ కు కంచుకోట అయిన బళ్లారి జిల్లాలో మళ్లీ గాలి జనార్దన్ రెడ్డి చక్రం తిప్పుతారని ఆయన అభిమానులు అంటున్నారు.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications