Friends: ప్రాణం తీసిన వైఫై పాస్వర్డ్, తల్లి మొబైల్ ఎత్తుకుని వెళ్లిన మైనర్ అబ్బాయి, మ్యాటర్ ?
ముంబాయి: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్బాయిలు, యువకులు ప్రతిరోజు కలుసుకుంటున్నారు. సాయంత్రం పూట కుటుంబ సభ్యులు ఉపయోగించే మొబైల్ ఫోన్లు బయటకు తీసుకు వస్తున్న అబ్బాయిలు మొబైల్ లో గేమ్స్ ఆడుకుంటున్నారు. ఓ యువకుడి మొబైల్ డేటా పూర్తి కావడంతో ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. అదే చోట ముగ్గురు అబ్బాయిల మద్య గొడవ జరిగింది. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో ఇద్దరు యువకులు కలిసి మైనర్ అబ్బాయిని పొడిచి చంపేశారు. ఓ చిన్న విషయంలో మైనర్ అబ్బాయి హత్యకు గురికావడం కలకలం రేపింది.

మైనర్ అబ్బాయి
ముంబాయి నగరంలోని కమోతా ప్రాంతంలో రాజ్ కుమార్ మౌర్య అలియాస్ రాజ్ కుమార్ (15) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాజ్ కుమార్ నివాసం ఉంటున్న ఏరియాలోనే రవీంద్ర అట్వాల్ అలియాస్ హరియాణ్వి, సంతోష్ వాల్మీకి అలియాస్ సంతోష్ అనే యువకులు నివాసం ఉంటున్నారు.

సాయంత్రం మీటింగ్ లు
చాలా సంవత్సరాల నుంచి రాజ్ కుమార్, రవీంద్ర, సంతోష్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్బాయిలు, యువకులు ప్రతిరోజు వీధి చివరిలోని నిర్జన ప్రదేశంలో కలుసుకుంటున్నారు. సాయంత్రం పూట కుటుంబ సభ్యులు ఉపయోగించే మొబైల్ ఫోన్లు బయటకు తీసుకు వస్తున్న అబ్బాయిలు మొబైల్ లో గేమ్స్ ఆడుకుంటున్నారు.

వైఫై పాస్వర్డ్ చెప్పలేదని
సంతోష్ మొబైల్ ఫోన్ లో మొబైల్ డేటా పూర్తి కావడంతో ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. అదే చోట రాజ్ కుమార్ కుర్చుని మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నాడు. మొబైల్ వైఫై పాస్వర్డ్ చెప్పాలని రవీంద్ర, సంతోష్ అక్కడే ఉన్న రాజ్ కుమార్ కు చెప్పారు. తాను మొబైల్ ఫోన్ వైఫ్ పాస్వర్డ్ చెప్పనని రాజ్ కుమార్ తేల్చి చెప్పాడు

కత్తులతో పొడిచి చంపేశారు
ఆ సందర్బంలో రవీంద్ర, సంతోష్ కలిసి రాజ్ కుమార్ తో గొడవ పెట్టుకున్నారు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో రవీంద్ర, సంతోష్ కలిసి మైనర్ అబ్బాయి రాజ్ కుమార్ ను కత్తులతో పొడిచేశారు. తీవ్రగాయాలైన రాజ్ కుమార్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజ్ కుమార్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి,

చిన్న విషయానికే ?
మొబైల్ ఫోన్ వైఫై పాస్వర్డ్ చెప్పలేదనే చిన్న విషయంలో మైనర్ అబ్బాయి రాజ్ కుమార్ ను హత్య చేసిన రవీంద్ర, సంతోష్ ను అరెస్టు చేశామని ముబాయి పోలీసులు తెలిపారు. రోజు ఆడుకోవడానికి మొబైల్ ఫోన్ బయటకు తీసుకు వెలుతున్న రాజ్ కుమార్ అదే మొబైల్ ఫోన్ వైఫై కోసం హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications